Hyderabad: మాల్స్ కు వెళ్లేవాళ్లకు అలర్ట్.. పిల్లల విషయంలో ఇలాంటి పరిస్థితా?

Hyderabad: ఆదివారం వస్తే చాలు పిల్లలు ప్లే జోన్ కి తీసుకెళ్లమని గొడవ చేస్తుంటారు. వాళ్ల ఆసక్తికి తగ్గట్టుగానే రకరకాల గేమ్స్ డిజైన్ చేసి పిల్లల్ని అట్రాక్ట్ చేస్తున్నారు మాల్ నిర్వాహకులు. అవే ఇప్పుడు పిల్లల్ని ఇబ్బందుల్లో నెట్టేస్తున్నాయి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రాణాలకి పెద్ద ముప్పునే తీసుకువస్తున్నాయి ఈ ప్లేజోన్స్.

అలాంటి ఘటనే తాజాగా హైదరాబాద్ సిటీ సెంటర్ మాల్ లో చోటుచేసుకుంది. ఇబ్రహీం నగర్ కు చెందిన ఒక వ్యక్తి ఆదివారం తన ముగ్గురు పిల్లల్ని తీసుకొని బంజారాహిల్స్ సిటీ సెంటర్ కి వాళ్ల ముగ్గురు పిల్లలని తీసుకుని వెళ్లారు. ముగ్గురు పిల్లలు ఆడుకుంటూ ఉండగా తెరిచి ఉన్న ఒక మిషన్లో మెహ్విష్ (3) చేయి పెట్టింది.

 

చిన్నారి చేతి వేళ్ళు ప్లే జోన్ మిషన్ లో పడి 3 వేళ్ళు నలిగిపోయాయి. వెంటనే యశోద హాస్పిటల్ కి తీసుకెళ్లగా అక్కడ వెంటనే పాపకి ఆపరేషన్ చేసినట్లు తల్లిదండ్రులు తెలిపారు. ఇక ఈ విషయం మీద పాప తల్లిదండ్రులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు.

 

సీసీటీవీ ఫుటేజ్ కూడా అందుబాటులో లేదని, అసలు సరియైన రక్షణ ఏర్పాట్లు చేయలేదని.. సిటీ మాల్ నిర్వాహకుల నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని తన కుమార్తెకు జరిగిన నష్టానికి మాల్ మేనేజ్మెంట్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పాప తండ్రి పోలీస్ స్టేషన్లో చెప్పుకొచ్చారు.దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

సిటీ సెంటర్ మాల్ నిర్వాహకులు జరిగిన ప్రమాదానికి బాధ్యత వహించకుండా సీసీటీవీ ఫుటేజ్ తొలగించడం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మీరు కూడా మీ పిల్లల్ని ప్లే జోన్ కి తీసుకువెళ్తే జాగ్రత్తగా ఉండండి. ఎంత నిర్వాహకుల నిర్లక్ష్యం అయినా అజాగ్రత్త వహిస్తే నష్టపోయేది మనమే కాబట్టి పూర్తి బాధ్యత మనమే తీసుకోవాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -