Onion: వేసవిలో ఉల్లిపాయ తింటే అన్ని రకాల ఉపయోగాలా?

Onion: సాధారణంగా ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అనే సామెతను వినే ఉంటాం. ఎందుకంటే ఉల్లిపాయ వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఉల్లిపాయను డైరెక్టుగా లేదంటే వంటలో రూపంలో అయినా కూడా తీసుకోవచ్చు. ఉల్లిపాయను తరుచూ తీసుకోవడం వలన రక్తము శుద్ధి అవుతుంది. శ్వాసక్రియకు ఇబ్బంది కలిగించే ఆయాసము, జలుబు వంటి ఊపిరితిత్తుల వ్యాధుల నుండి బయటపడవచ్చు. ఉల్లికి చలవ చేసే గుణం ఉంటుంది. ఇది కూరకు రుచిని ఇవ్వడంతో పాటు ఎన్నో రకాల ప్రయోజనాలను కలిగిస్తుంది. ఉల్లిపాయలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.

ఉల్లిపాయలో ఉండే ఔషధ గుణాలు తలనొప్పి, గుండె జబ్బులు, నోటి పుండ్లు వంటి వ్యాధుల చికిత్సలకీ ఎంతో బాగా ఉపయోగపడతాయి. ఇక వేసవి కాలం వచ్చిందంటే ఎండ వేడిమి నుంచి ఉపశమనం కోసం రాత్రి పూట అన్నం వండి అందులో ఉల్లిపాయ, పాలు వేసి తోడు పెట్టేవారు ఉదయాన్నే అది తింటే వడ దెబ్బ తగలకుండా, శరీరం డీ హైడ్రేషన్ కు గురికాకుండా ఉంటుంది. వేసవిలో శరీరం వేడెక్కుతున్న కొద్దీ చెమట రూపంలో లవణాలను కోల్పోతుంది. ఇది డీహైడ్రేషన్‌కు కారణమవుతుంది. వేసవి తాపం వల్ల మనం ప్రతికూలంగా ప్రభావితమైనప్పుడు మన శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి.

 

విపరీతమైన జ్వరం, తలనొప్పి, తల తిరగడం, ఆయాసం, శ్వాస తీసుకోవడంలో సమస్యలు తలెత్తుతాయి. ఉల్లిపాయలు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. వేసవి ఎండ ప్రభావం నుంచి కాపాడుతుంది. ఇది జుట్టు రాలడాన్ని కూడా నివారిస్తుంది. ఇది శరీరాన్ని చల్లబరచడంలో కూడా సహాయపడుతుంది. ముఖ్యంగా ఎరుపు రంగులో ఉన్న ఉల్లిపాయల్లో క్వెర్సెటిన్ అనే రసాయనం ఉంటుంది. ఇది యాంటీ హిస్టమైన్ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఉల్లిపాయలు వేసవిలో ప్రతిరోజూ తప్పనిసరిగా తీసుకోవాలి. ఇది వ్యాధుల నుండి దూరంగా ఉంచటానికి సహాయపడుతుంది. చర్మానికి కూడా మేలు చేస్తుంది. జీర్ణ రసాల స్రావాన్ని పెంచడంలో సహాయపడతాయి. చెడు కొలెస్ట్రాల్‌ను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. ఉల్లిపాయ రసం చర్మం కాలిన గాయాలను నయం చేయడంలో కూడా సహాయపడుతుంది. శరీరాన్ని చల్లబరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి, హీట్ స్ట్రోక్‌ను నిరోధించడంలో సహాయపడతాయి. పచ్చి ఉల్లిపాయలను క్రమం తప్పకుండా తినడం వల్ల వ్యాధుల బారిన పడే ప్రమాదం తగ్గుతుంది. ఉల్లిపాయ రసం చర్మాన్ని మృదువుగా చేస్తుంది. జ్వరం వచ్చినప్పుడు ఉల్లిపాయ ముక్కలుగా తరిగి బట్టలో వేసి మూటకట్టి నుదుటిపై ఉంచాలి. ఇది తక్షణ ఉపశమనాన్ని అందిస్తుంది. పచ్చి ఉల్లిపాయ ముక్కల మీద నిమ్మరసం చల్లుకుని తినవచ్చు లేదా పెరుగన్నంలో వేసుకుని తింటే కూడా రుచిగా ఉంటుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -