Palak: వామ్మో పాలకూరతో అన్ని రకాల ప్రయోజనాలా?

Palak: మన వంటిట్లో ఉండే ఆకుకూరల్లో పాలకూర కూడా ఒకటి. పాలకూర వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కానీ చాలా తక్కువ మంది మాత్రమే పాలకూరను తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. పాలకూరలో ఉండే పోషకాలు అన్నీ ఇన్నీ కావు. అందుకే ఆకుకూరల్లో పాలకూర ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. కొంతమంది పాలకూరను ఉపయోగిస్తే మరి కొంతమంది జ్యూస్ ల రూపంలో కూడా తీసుకుంటూ ఉంటారు. జ్యూస్ ల రూపంలో తీసుకోవడం వల్ల కొన్ని రకాల వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు.

ఇందులో విటమిన్స్ ఎ, ఇ, సి, బి కాంప్లెక్స్, కెరోటిన్, పొటాషియం మెగ్నీషియం వంటివి పుష్కలంగా లభిస్తాయి. పాలకూర జ్యూస్ తాగడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి. మరి ఆ జ్యూస్ ని ఎలా తయారు చేస్తారో దాని వల్ల ఎన్ని రకాల ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇందుకోసం ముందుగా రెండు కప్పుల పాలకూరని శుభ్రంగా కడిగి కట్ చేసుకుని పక్కన పెట్టుకొని ఒక యాపిల్ని పెద్ద పెద్ద పీస్ లుగా కట్ చేయాలి. మిక్సీలో ముందుగానే కొన్ని నీళ్లు పోసి యాపిల్ పాలకూర ముక్కలను అందులో వేయాలి. బాగా మిక్సీకి వేసిన తర్వాత అందులో కొంచెం నిమ్మరసం కలపాలి. ఆ తర్వాత పూర్తిగా కలిసేలా మిక్స్ చేయాలి. అయితే ముక్కలు పూర్తిగా గ్రైండ్ అయ్యేలా చూసుకోవాలి.

 

అనంతరం ఆ జ్యూస్‌ను వడకట్టి గ్లాసులో పోసుకొని తాగాలి. పాలకూరలో విటమిన్ కే ఉంటుంది. దాని వల్ల ఎముకల్లో కాల్షియాన్ని పెంచేందుకు తోడ్పడుతుంది. పాలకూరలో క్లోరోఫిల్, బీటా కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి. కాగా ఇవి కళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇందులో ఉండే మాక్యులా రెటీనాకు సంబంధించిన ఒక పార్ట్. ఇది నేచురల్ సన్‌బ్లాక్, హాని కలిగించే కాంతి నుంచి కంటికి రక్షణ ఇస్తుంది. గుండె ఆరోగ్యం సైతం మరింత మెరుగవుతుంది. పాలకూరలోని విటమిన్-సి ముడతలు ఏర్పడకుండా చూస్తుంది. కంటి చూపునకు ఇదొక దివ్య ఔషదంగా చెప్పుకోవచ్చు. అందుకే కంటి సమస్యలు ఉన్న వారు పాలకూరను ఎక్కువగా తీసుకోవాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -