Chandrababu: కడపలో కూడా కూటమి.. చంద్రబాబు దెబ్బ అదుర్స్ కదా?

Chandrababu: ఏపీలో రాజకీయాలు మారుతున్నాయి. తమకి అడ్డే లేదనుకునే వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీకి పెట్టని కోట లాంటి కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలో పట్టభద్రులు కూడా ఆ పార్టీని బై బై చెప్పేశారు.గత ఎన్నికల్లో అక్కడ్నుంచి వైసీపీ భారీ మెజార్టీతో గెలిచింది.కానీ ఈ సారి అధికారంలో ఉండి కూడా ఘోర పరాజయాన్ని పాలైంది.ద్వితీయ ప్రాధాన్య ఓట్ల లెక్కింపు తర్వాత టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి విజయం సాధించారు. దీంతో తెలుగుదేశం పార్టీ అభిమానులు పులివెందులలో కూడా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు.

భూమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నియోజవర్గం పులివెందులనే. మొదటి నుంచి పట్టభద్రుల ఎమ్మెల్సీ సీటుపై గురి పెట్టి శ్రమించారు. కడపలో ముఖ్యంగా పులివెందుల నియోజకవర్గంలో బ్యాలెట్ రిగ్గింగ్ ఉంటుంది. అయినా తీవ్ర స్థాయిలో పోరాడారు. చివరికి పులివెందులలో కూడా భూమిరెడ్డికి మెజార్టీ వచ్చింది. ఇప్పటికే టీడీపీ తపున బీటెక్ రవి పులివెందుల నుంచి స్థానిక సంస్థ కోటాల కింద ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆ నియోజకవర్గం నుంచి టీడీపీకి ఇద్దరు ఎమ్మెల్సీలు ఉన్నట్లయింది. పశ్చిమ సీమలోనూ వైసీపీ ఓడిపోవడం ఆ పార్టీకి నైతికంగా పెద్ద దెబ్బ, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో కలిపి టీడీపీకి గత ఎన్నికల్లో రెండు అంటే రెండు అసెంబ్లీ సీట్లు వచ్చాయి. కడప, కర్నూలులో ఒక్కటీ రాలేదు. నాలుగేళ్లలోనే పరిస్థిత మారిపోవడం వైసీపీ వర్గాలకూ ఇబ్బందికరంగా మారింది.

 

బీజేపీ ఓటర్ల రెండో ప్రాధాన్యత కూడా టీడీపీనే. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిబంధనల ప్రకారం ఎవరికీ తొలి ఓటింగ్‌లోనే యాభై శాతం రాలేదు. కానీ ద్వితీయ ప్రాధాన్య ఓట్లతో గెలిచారు.ఈ ద్వితీయ ప్రాధాన్య ఓట్లలో కూడా టీడీపీ అభ్యర్థులకే ఎక్కువ ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి ఎలిమినేషన్ రౌండ్‌లో ఆ పార్టీకి ఓటు వేసిన ఓటర్లు ద్వితీయ ప్రాధాన్యంగా తెలుగుదేశం అభ్యర్థులకే మద్దతిచ్చారు. ఇది రాజకీయవర్గాలను కూడా ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే బీజేపీ సంప్రదాయ ఓటర్లు టీడీపీకి మద్దతివ్వరన్న ఓ ప్రచారం ఉంది. కానీ అది నిజం కాదని ఈ ఎన్నికల ద్వారా తేలినట్లయింది.

 

సోషల్ మీడియాలోనూ కొంత మంది బీజేపీ నేతలు, ఆ పార్టీ కార్యకర్తలు చాలా తీవ్రంగా టీడీపీని విమర్శిస్తూ ఉంటారు.వైసీపీకి మద్దతుగా ఉంటూ ఉంటారు.తము వైసీపీకైనా ఓటు వేస్తాం కానీ టీడీపీకి కాదన్నట్లుగా వాదిస్తూ ఉంటారు.ఇలాంటి అభిప్రాయాలు ఉన్న వాళ్లు బీజేపీలో పరిమితంగా ఉంటారని స్పష్టమైంది.మూడు ఎమ్మెల్సీల్లో ముఖ్యంగా రాయలసీమలో టీడీపీ విజయాల వెనుక ఉన్నది ద్వితీయ ప్రాధాన్య ఓట్లే.బీజేపీ కార్యకర్తలు కూడా ఆ పార్టీ తర్వాత టీడీపీనే అనుకున్నారు కానీ, బీజేపీ అనుకోలేదు.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -