Bigg Boss 7: బుల్లితెరపై బిగ్ బాస్ షో అట్టర్ ఫ్లాప్.. ప్రచారం చేస్తున్న రేటింగ్స్ లో అసలు లెక్కలివే!

Bigg Boss 7: బుల్లితెర పై ప్రసారమవుతున్నటువంటి కార్యక్రమాలలో బిగ్ బాస్ రియాల్టీ షో ఒకటి. ఈ కార్యక్రమం అద్భుతమైనటువంటి ఆదరణ పొందుతుంది ఇక తెలుగులో ఇప్పటికీ ఆరు సీజన్లను పూర్తి చేసుకున్నటువంటి ఈ కార్యక్రమం ఏడవ సీజన్ కూడా ప్రసారమైంది 14 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైనటువంటి ఈ షో ఈసారి కొత్తగా ఉండబోతుంది అంటూ నాగార్జున ఈ కార్యక్రమాన్ని చాలా హైలెట్ చేశారు అయితే ఈ షో కూడా పెద్దగా ప్రేక్షకులను మెప్పిస్తుందా లేదా అన్న సందేహం అయితే అందరిలోనూ కలిగింది.

ఈ క్రమంలోనే ఈ కార్యక్రమం రేటింగ్స్ ఎంత వస్తుంది ఈ షో ఈసారైనా హిట్ అయినట్లేనా లేకుంటే ఈసారి కూడా అట్టర్ ప్లాప్ అయిందా అన్న విషయం గురించి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా ఈ కార్యక్రమం ఎపిసోడ్ కి సంబంధించిన రేటింగ్స్ విడుదల చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది. అయితే ఈ కార్యక్రమం లాంచింగ్ డే ఎపిసోడ్ భారీ స్థాయిలో రేటింగ్స్ సొంతం చేసుకున్నాయి. ఇక ఎపిసోడ్ లాంచింగ్ డే కావడంతో తప్పనిసరిగా మంచి రేటింగ్స్ వస్తాయి అనడంలో సందేహం లేదు అయితే వీకెండ్ కూడా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి రేటింగ్స్ ఎంత అనే విషయానికి వస్తే…

ఇక ఈ కార్యక్రమానికి సంబంధించిన వీకెండ్ ఎపిసోడ్స్ లో ఏకంగా 18.1 రేటింగ్ వచ్చిందనీ తెలుస్తుంది. అయితే ఇది చూసినటువంటి అందరూ నిజంగానే బిగ్ బాస్ ఎపిసోడ్ కి ఇంత రేటింగ్ వచ్చిందా అని సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి 10 రేటింగ్ వస్తే చాలు అనుకునే రోజులకు కూడా ఉన్నాయి అలాంటిది ఈ సీజన్ మాత్రమే ఏకంగా 18 రావడం ఏంటి ఆశ్చర్యం కలగక మానదు.

ఇక హైదరాబాద్ బార్క్ రేటింగ్ ఒరిజినల్ లిస్ట్ కనక పెడితే బిగ్ బాస్ కార్యక్రమం రేటింగ్ ఎంత అనేది తెలిసిపోతుంది మరి ఈ లిస్టులో ఈ కార్యక్రమానికి వచ్చినది కేవలం 8.46 మాత్రమే. ఇక ఏపీ తెలంగాణలో ఎంత అని ఆరా తీస్తే అక్కడ 15 అని తేలింది బిగ్ బాస్ కార్యక్రమానికి 15 రేటింగ్ రావడం అంటే గొప్ప అయినప్పటికీ 18 అనేది ఫేక్ అవడంతో కొందరు ట్రోల్ చేస్తున్నారు. ఇలా రేటింగ్స్ చూపించుకోవడంలో పడే తంటాలు ఎదో టాస్కుల విషయంలో పడితే ఆటోమేటిక్ గా రేటింగ్స్ వస్తాయి కదా అంటూ ఈ విషయంపై కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -