AP Election: ఏపీలో ఎన్నికల పోలింగ్ అప్పుడేనట.. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడేది ఎప్పుడంటే?

AP Election: దేశవ్యాప్తంగా ఎన్నికల వేడి పెరుగుతోంది. సమ్మర్ సెగలు కంటే.. పొలిటికల్ హీటే ఎక్కువగా కనిపిస్తోంది. జాతీయ స్థాయిలో ఎన్డీఏ కూటమి 400 స్థానాలు గెలవాలని మోడీ, అమిత్ షా ప్రచారం జోరు పెంచుతున్నారు. టార్గెట్ 400తో వచ్చే ఎన్నికల రణరంగంలో దూకబోతున్నారు. పదేపది ఎన్డీఏ 400 స్థానాలకు పైగా గెలుస్తుందని చెబుతున్నారు. అది ఏదో మామూలుగా చెబుతున్న మాటలు కాదు. 404 కంటే ఎక్కువ స్థానాలు గెలవాలని బీజేపీ పెట్టుకున్న టార్గెట్. ఎందుకంటే 1984లో రాజీవ్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ ఎన్నికలకు వెళ్లినపుడు 404 స్థానాలు ఆ పార్టీ గెలుచుకుంది. దాన్ని బ్రేక్ చేయాలని బీజేపీ టార్గెట్ పెట్టుకుంది. ఒక్క బీజేపీ అన్ని స్థానాలను బ్రేక్ చేయకపోయినా.. మోడీ, అమిత్ షా నాయకత్వంలోని ఎన్డీఏ బ్రేక్ చేయాలని అనుకుంటుంది. అందుకే.. వీలైనన్ని పార్టీలను ఎన్డీఏలో కలుపుకొని పోతున్నారు. నితీష్ కుమార్, దేవెగౌడ లాంటి వారిని కలపుకోవడంలో వ్యూహం అదే. ఇప్పుడు టీడీపీని ఆహ్వానించడానికి కారణం కూడా అదే. మరోవైపు ఒడిశాలో బీజేడీని కూడా కలుపుకునేందుకు చర్చలు జరుపుతున్నారు.

మోడీ, అమిత్ షా ఈ విధంగా దూకుడు పెంచుతుంటే.. ఇండియా కూటమి కూడా తనదైన శైలిలో వ్యూహాలు రచిస్తోంది. మొన్న జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాలను కాంగ్రెస్ కోల్పోయింది. దీంతో.. మిత్ర పార్టీలు కాంగ్రెస్ పై ఎక్కువ సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ కూడా దానికి తగ్గట్టుగానే నడుచుకుంటోంది. పైగా కూటమి నుంచి నితీష్ కుమార్ బయటకు వెళ్లిన తర్వాత.. ఇలాంటి నష్టం మరోసారి జరగకూడదని కాంగ్రెస్ జాగ్రత్త పడుతోంది. ఎస్పీతో విజయవంతంగా పొత్తును ప్రకటించింది. సీట్ల సర్ధుబాటు కూడా చేసుకుంది. 80 స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్‌లో సీట్ల సర్ధుబాటు విజయవంతం చేసుకోవడం ఇండియా కూటమి అతిపెద్ద విజయంగా చెప్పుకోవచ్చు. ఇక ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో ఆప్ తో కూడా పొత్తు ఖాయం అయింది. సీట్లు సర్దుబాటు కూడా జరిగింది. మరో వైపు పశ్చిమబెంగాల్‌లో టీఎంసీతో చర్చలు జరుగుతున్నాయి. ఇలా ఓవైపు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్ వ్యూహా, ప్రతివ్యూహాలు రెడీ చేస్తున్నారు. ఈ రెండు పార్టీలు తొలి విడత జాబితా కూడా ప్రకటించాయి.

జాతీయ రాజకీయాలు అటు పెడితే ఏపీలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఏపీలో లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతాయి. అందుకే మరింత ఇంట్రస్టింగ్ జరుగుతున్నాయి. చంద్రబాబు, లోకేష్ ఇప్పటికే సుడిగాలి పర్యటన చేస్తున్నారు. సిద్దం సభలో జగన్ హోరెత్తిస్తున్నారు. పవన్ కూడా ఇవాళో, రేపు కధనరంగంలోకి దూకేస్తారు. ఇక ఎన్నికల షెడ్యూల్ రావడమే ఆలస్యం.

అయితే.. షెడ్యూల్ కూడా ఈవారంలోనే ప్రకటించే అవకాశం ఉంది. మార్చి 14-16 తేదీల మధ్యన ప్రకటిస్తారని సమాచారం. లోక్ సభతో పాటు.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కూడా తేదీలు ప్రకటించనున్నారు. ఈసీ మూడు రోజుల పాటు జమ్మూ కశ్మీర్‌లో పర్యటించనుంది. సెప్టంబర్ లోగా జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. పార్లమెంట్ ఎన్నికలతో నిర్వహించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. అందుకే అక్కడ ఈసీ పర్యటించనుంది. ఏపీలో ఏప్రిల్‌ నెలాఖరులో లేదా మే మొదటి వారంలో పోలింగ్‌ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -