Hyderabad: ఆత్మహత్య చేసుకున్న ఉద్యోగి.. ఎందుకో తెలుసా?

Hyderabad: టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ ఫోన్ లను వినియోగిస్తున్నారు. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్ గేమ్ లకు ఎడిక్ట్ అయిపోయారు. చాలామంది ఈ ఆన్లైన్ గేమ్ ల మోజులో పడి లక్షలకు లక్షలు డబ్బులు పోగొట్టుకుంటున్నారు. తీరా చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే లాభం ఏమీ అన్నట్టు అంతా మోసపోయి డబ్బులు పోగొట్టుకున్న తర్వాత చాలామంది డిప్రెషన్ లోకి వెళ్లడం ఆత్మహత్యలు చేసుకోవడం లాంటివి చేస్తున్నారు.

తాజాగా అటువంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే.. ఈ ఘటన కుషాయిగూడ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. డీఏఈ కాలనీలోని డి 2/43 క్వార్టర్స్​లో ఉంటున్న వరద శివ అనే 31 ఏళ్ల న్యూక్లియర్ ఫ్లుయెల్ కాంప్లెక్స్ సంస్థలో వర్క్ అసిస్టెంట్​గా గత ఏడేళ్లుగా పని చేస్తున్నాడు. అతని సొంత ఊరు ఆంధ్రప్రదేశ్​ లోని ప్రొద్దుటూరు. శివకు మూడేళ్ల కింద పెళ్లి కూడా అయ్యింది. అతడికి భార్య ప్రభాత, ఏడాదిన్నర వయసు ఉన్న కొడుకు వేదాన్ష్ కూడా ఉన్నారు. అయితే ఇటీవల భార్య పంటి నొప్పితో బాధపడుతుండడంతో భార్య ప్రభాతను ట్రీట్​మెంట్ కోసం ఈనెల 2న ఆమె సొంతూరు జోగులాంబ గద్వాలలోని తల్లిగారి ఇంటి దగ్గర దింపి వచ్చాడు.

అయితే ఆన్లైన్ గేమ్స్ కి అలవాటు పడిన శివకు అదే శాపంగా మారింది. ఇలా గేమ్స్ ఆడుతూ అతడు లక్షల్లో డబ్బు పోగొట్టుకొని అప్పుల్లో కూరుకుపోయాడు. అప్పుల బాధ తట్టుకోలేక తాజాగా ఇంట్లోని ఫ్యానుకు ఉరేసుకున్నాడు. రాత్రివేళ భర్తకు భార్య ప్రభాత ఎన్నిసార్లు కాల్స్ చేసినా స్పందించకపోవడంతో సెక్యూరిటీకి ప్రభాత సమాచారం ఇచ్చింది. సెక్యూరిటీ వచ్చి తలుపులు బద్దలు కొట్టి చూడగా అప్పటికే శివ ఉరివేసుకొని మృతి చెందాడు. వెంటనే సెక్యూరిటీ అతని భార్య ప్రభాతకు అలాగే పోలీసులకు సమాచారం అందించాడు. ఇక పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు.

ఆన్​లైన్ గేమ్స్ ఆడుతూ రూ.12 లక్షలు అప్పులు చేస్తే తామే తీర్చామని అతడి దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్​ను తీసుకుని చిన్న ఫోన్ ఇచ్చినా అలవాట్లలో మార్పులు రాలేదని మామ మహంకాళి శ్రీనివాసులు కన్నీరుమున్నీరుగా చారు. అయితే ఆత్మహత్య చేసుకోవడానికి ముందు శివ రాసిన సూసైడ్ నోట్ అందర్నీ కంటతడి పెట్టిస్తోంది. కొడుకులు వేదాన్ష్ కోసం ఏమీ చేయలేకపోతున్నాను.. నా మెదడును అదుపు చేయలేకపోతున్నాను.. నా చావుకు నేనే కారణం.. మిత్రులు, కుటుంబ సభ్యులు నన్ను క్షమించాలి.. వేరే దారి లేకే ఈ నిర్ణయం తీసుకున్నాను.. నన్ను క్షమించండి అని సూసైడ్ నోట్​లో శివ రాశాడని పోలీసులు తెలిపారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -