Anasuya: ఆ ఒక్క తప్పు వల్లే అనసూయ ఆస్తులు కరిగిపోయాయా?

Anasuya: తెలుగు రాష్ట్ర ప్రజలకు యాంకర్ అనసూయ సుపరిచితురాలే. బుల్లితెర కామెడీ షో ‘జబర్దస్త్’ ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకుంది. అప్పటివరకు యాంకర్ అంటే కేవలం సుమ పేరు మాత్రమే వినిపించేది. కానీ అనసూయ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి.. అందరి చూపును తనవైపు తిప్పుకునేలా చేసుకుంది. స్టేజీ మీద మాటల వరకే పరిమితమైన యాంకరింగ్‌లో గ్లామర్ డోస్ ఇంట్రడ్యూస్ చేసింది. అదిరిపోయే అందంతో.. స్టెప్పులు వేసి కుర్రకారును తనవైపు తిప్పుకుంది. జబర్దస్త్ షో ద్వారా మంచి పాపులారిటీ, క్రేజ్ సంపాదించుకున్న ఈ భామ.. సినిమాల్లో కూడా అవకాశాలు చేజిక్కించుకుంది. రంగస్థలం, పుష్ప వంటి సినిమాల్లో నటించి.. విమర్శకుల మెప్పులు కూడా పొందింది. దాదాపు 9 ఏళ్లు జబర్దస్త్‌ తో కొనసాగిన ఈ భామ.. ఈ మధ్యనే షోకు గుడ్ బై చెప్పింది. ఆమె స్థానంలో జబర్దస్త్ యాజమాన్యం సౌమ్యరావును యాంకర్‌గా పరిచయం చేసింది.

 

స్టార్ మాలో సుడిగాలి సుధీర్‌తో కలిసి ఓ షో కూడా చేసింది. కానీ ఆ షో కూడా పూర్తవడంతో ఇప్పుడు బుల్లితెరపై కనిపించకుండా పోయింది. ప్రస్తుతం సినిమాల్లోనే ఆఫర్లు అందిపుచ్చుకుంటూ ఫుల్ బిజీగా ఉంటోంది. తాజాగా ఈ భామ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో ఆమె తన కుటుంబానికి సంబంధించి సంచలన విషయాలు బయటపెట్టింది. ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ..‘మేం చిన్నప్పుడు మా దగ్గర చాలా ఆస్తి ఉండేది. మాకు గుర్రాలు కూడా ఉండేవి. అప్పట్లో గుర్రాల రేసులు బాగా జరిగేవి. మా నాన్న గుర్రాల రేసులో బెట్టింగ్‌లు పెట్టేవారు. అలా మా ఆస్తి పూర్తిగా పోగొట్టుకున్నాం. కిరాయి రూమ్‌లో అద్దెకుంటూ చాలా కాలం అలానే జీవించాం. చేతిలో డబ్బులు కూడా ఉండేది కాదు. కొన్ని సార్లు డబ్బులు లేక బస్టాండ్‌ వరకు నడుచుకుంటూ వెళ్లే వాళ్లం. కుటుంబం రోడ్డుపై వచ్చినా.. ఎప్పుడు మా నాన్న మమ్మల్నీ ఏ లోటు రానివ్వకుండా చూసుకున్నారు. ఆయన స్థోమత ఉన్నంతలో మమ్మల్నీ బాగా చూసుకున్నారు. అప్పుడు ఆయనను చూసే ధైర్యంగా ఎలా ఉండాలో తెలిసింది. ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కొనేలా పెరిగాం. ఇప్పుడు ఆర్థికంగా బాగానే సెటిల్ అయ్యాం. ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదు.’ అని ఆమె చెప్పుకొచ్చింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -