Anasuya Bharadwaj: ఆ విమానంలో కూర్చున్నప్పుడు డ్రెస్స్ చిరిగింది: అనసూయ

Anasuya Bharadwaj: జబర్దస్త్ షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న వారిలో యాంకర్ అనసూయ ఒకరు. ఒక వైపు షోలు, మరో వైపు సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నారు. కెరీర్ విషయంలో ఎంత బిజీగా ఉన్నా.. ఫ్యామిలీతోనూ టైం స్పెండ్ చేస్తుంటారు. అలాగే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. సినిమా విషయాలతోపాటు వ్యక్తిగత విషయాలను సైతం సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటారు. అయితే సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్టులకు పాజిటివ్ కామెంట్లతోపాటు నెగిటివ్ కామెంట్లు కూడా వస్తుంటాయి. వీటి వల్ల పలు సందర్భాల్లో అనసూయ ట్రోలింగ్‌కి కూడా గురైంది. అయినా అనసూయ తన పంథాను మార్చుకోలేదు. తనకు నచ్చిన, నచ్చని అంశాలపై ముక్కుసూటిగా జవాబులిస్తూ ఎప్పటికప్పుడూ వార్తలో నిలుస్తుంటారు.

అయితే తాజాగా అనసూయ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ఎయిర్‌పోర్టులో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకుంది. ఇటీవల ఫ్యామిలీతో కలిసి బెంగళూరు ట్రిప్‌కు వెళ్లిన అనసూయ హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమైంది. హైదరాబాద్‌కు రావడానికి అలియన్స్ ఎయిర్ సంస్థకు చెందిన ఫ్లెట్ టికెట్స్ బుక్ చేసిందట. ఎయిర్‌పోర్టుకు వెళ్లినప్పటి నుంచి ఫ్లైట్ ఎక్కేంత వరకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు అనసూయ పేర్కొంది. ఈ క్రమంలో ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఒక పోస్ట్‌ ను షేర్ చేసింది.

ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ.. ‘బెంగళూరు నుంచి హైదరాబాద్ రావడానికి అలియన్స్ ఎయిర్ సంస్థకు చెందిన విమానంలో టికెట్స్ బుక్ చేశాను. ఆ విమానం సాయంత్రం 6.55 గంటలకు టేకాఫ్ అవ్వాలి. కానీ దాదాపు అరగంట లేటుగా వచ్చింది. అప్పటికే మా ఫ్యామిలీ బస్‌లోనే వెయిట్ చేస్తూ ఉన్నాం. విమానం రాగానే లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించాం. కానీ ఎయిర్‌పోర్ట్ సిబ్బంది ఆపేశారు. మాస్క్ ధరించలేదనే కారణంతో వెయిట్ చేయించారు. చివరకు మాస్కు ధరించి లోపలికి వెళ్తే.. విమానంలో ఒక్కొక్కరికి వేరు వేరు చోట్లలో సీట్లు కేటాయించారు. అందరూ ఒకే చోట కూర్చునేలా టికెట్లు బుక్ చేశాను. ఫ్లైట్‌లో సీట్లు కూడా సరిగ్గా లేవు. కూర్చున్నప్పుడు నా డ్రెస్ చిరిగింది.’ అని అసహనం వ్యక్తం చేసింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -