RRR: ఆంధ్ర బయ్యర్ ఆవేదన.. ఆర్ఆర్ఆర్ మూవీ అసలు లెక్కలు ఇవేనా?

RRR: ఒకప్పుడు సినిమా వస్తే దానికోసం కస్టపడిన ప్రతి ఒక్కరూ లాభాలను పొందేవారు. హీరోలు కూడా తక్కువ మొత్తంలోనే డబ్బులు తీసుకునేవారు. అలాగే సినిమా సాటిలైట్ల రేట్లు, హిందీ డబ్బింగ్ రేట్లు అంటూ సినిమా ధియేటర్ వాళ్లకి అలాగే నిర్మాతలకి కూడా ఆదాయం బానే ఉండేది.

కానీ రోజులు గడుస్తూ తెలుగు సినిమాలను హిందీ డబ్బింగ్ లో కూడా చూడడం మొదలుపెట్టారు. కనుక సాదాసీదాగా ఉండే సినిమాలకు కూడా అక్కడ ఎక్కువ రేటింగ్ రావడం వల్ల హీరో లు రేట్లు పెంచేస్తున్నారు, వరుసగా సినిమాలు తీస్తున్నారు.

అలాగే సినిమాలలో ఫైట్లు అలాగే గ్రాఫిక్స్ లాంటివి పెట్టడం వల్ల సినిమాకు బడ్జెట్లు కూడా పెరిగిపోతున్నాయి. కానీ ఎవరికి నష్టాలు మాత్రం జరగడం లేదు. కానీ ఎప్పుడైతే ఓటిటి వచ్చిందో అప్పుడు థియేటర్ రైట్స్ అన్ని తగ్గిపోయాయి.

 

చాలా ఎక్కువగా మొత్తం మీద ott కి సినిమాను అమ్మేస్తున్నారు నిర్మాతలు. ఎంత పెద్ద సినిమా అయినా ఎప్పటికైనా ఓటీటి లోకి రావాల్సిందే అని చాలా మటుకు ప్రజలు కూడా థియేటర్లు వైపు వెళ్లడమే మానేస్తున్నారు. థియేటర్లలో కూడా ఎంత పెద్ద సినిమా అయినా సరే కొన్ని రోజులే ఆడుతుంది.

 

అంతే కానీ ఒకప్పటిలాగా 50 రోజులు 100 రోజులు ఫంక్షన్లు కనుమరుగైపోయాయి. ఎంత మంచి సినిమా అయినా సరే ఒక నెలలో దాని విలువ పడిపోతుంది. దీనివల్ల నిర్మాతలకు కూడా ఎటువంటి నష్టం లేదు. ఎందుకంటే ott అని, శాటిలైట్ రైట్స్ వల్ల వాళ్లకి లాభాలు బానే ఉన్నాయి.

 

కానీ ఎటు చూసినా నష్టపోయేది బయ్యర్లు మాత్రమే. ఆర్ ఆర్ ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ కి ఏపీ లో నష్టాలు మిగిలాయాంటే నమ్ముతార.. కానీ ఇది నిజం.పాపం పెద్ద మొత్తాన్ని పెట్టి సినిమాని కొంటున్నారు కానీ థియేటర్లలో చూడడానికి ఎక్కువ మంది ప్రేక్షకులు లేకపోవడంతో చాలా మటుకు నష్టపోతున్నారు. కనుక అందరు బయర్లు కలిపి ఒక మీటింగ్ పెట్టారు.

 

అందులో ఒక ఆంధ్రాబయ్యర్ చెప్పిన విషయం ఏమిటంటే “బయట హిట్ టాక్ వచ్చిన సినిమాలకు కూడా ఇక్కడ లాభాలు లేకపోతున్నాయి. మీరు ఏ హిట్ సినిమా చెప్తే ఆ సినిమాకి ఎంత నష్టం వచ్చిందో నేను చెప్తాను. ఆఖరికి ఆర్ ఆర్ ఆర్ లాంటి సినిమాలకు కూడా ఇక్కడ నష్టాలు వచ్చిన ప్రాంతాలు ఉన్నాయి” అని వాళ్ళ ఆవేదనను తెలుపుతున్నారు. ఇలాగే నష్టాలు జరిగితే టాలీవుడ్ పయనం ఎటువైపు వెళుతుంది? నిర్మాతలు, బయ్యర్లు అందరూ కూర్చొని దీనికి సరైన పరిష్కారం వెతకాలి

Related Articles

ట్రేండింగ్

CM Jagan: జగన్ మేనిఫెస్టో మోసాలు.. శవాల మీద పేలాలు ఏరుకునేలా రాజకీయాలు చేశారా?

CM Jagan:  జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో తనకు బైబిల్ ఖురాన్ భగవద్గీత లాంటిది అని చెబుతూ ఉంటారు అయితే ఎన్నికలలో భాగంగా మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఎన్నో పథకాలను అమలు పరచలేదు అయితే ఇలాంటి...
- Advertisement -
- Advertisement -