RRR: సిక్సర్ కొట్టిన ఎన్టీఆర్, చరణ్ ఆర్ఆర్ఆర్… ఆ మరకను రాజమౌళి చెరిపేశారుగా!

RRR: తాజాగా 69వ జాతీయ అవార్డుల కార్యక్రమం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఆగస్టు 24న 2021 సినిమాలకు గాను అవార్డులు లభించాయి. ఇందులో భాగంగానే ఆర్ఆర్ఆర్ కు జాతీయ అవార్డుల పంట పండింది. అయితే ఒక తెలుగు సినిమాకు జాతీయ స్థాయిలో ఆరు అవార్డులు రావడం గర్వనీయం. ఇప్పటికే అస్కార్ అవార్డు కొట్టేసిన ఈ చిత్రం ఇప్పుడు జాతీయ స్థాయిలోనూ తన సత్తా చూపించింది. 69వ జాతీయ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రటించగా అందులో ఆర్ఆర్ఆర్ సినిమా ఆరు అవార్డులు సాధించింది.

6 విభాగాల్లో నిలిచి మరోసారి తెలుగోడి సత్తాను ఇండస్ట్రీకి పరిచయం చేసింది త్రిబుల్ ఆర్. ఇక బెస్ట్ పాపులర్ మూవీ ఆర్ఆర్ఆర్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ – ఎంఎం కీరవాణి, బెస్ట్ మేల్ ప్లే బ్యాక్ సింగర్ – కాలభైరవ, బెస్ట్ యాక్షన్ డైరెక్షన్ అవార్డ్ – కింగ్ సోలోమాన్, బెస్ట్ కొరియోగ్రఫీ – ప్రేమ్ రక్షిత్, బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ – వీ శ్రీనివాస్ మోహన్ అవార్డులు వచ్చాయి. దీంతో ఒకే సినిమాకు వరుసగా 6 జాతీయ అవార్డులు లభించడంతో ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ప్రస్తుతం చిత్ర బృందం ఈ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు.

 

టాలీవుడ్ స్టార్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ ఆర్ఆర్ఆర్ మూవీ గత ఏడాది విడుదల అయ్యి దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే. ప్రపంచ దేశాల్లో కొన్ని నెలల పాటు సినిమా థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా ఆడి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. హీరో రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ లను గ్లోబల్ స్టార్లుగా మార్చేసింది. ఆస్కార్ అవార్డులను సైతం సొంతం చేసుకుంది. ఇప్పుడు జాతీయ స్థాయిలో నేషనల్ అవార్డులను కూడా సొంతం చేస్తుంది ఆర్ఆర్ఆర్.

Related Articles

ట్రేండింగ్

Union Minister Piyush Goyal: వైఎస్సార్ ను సైతం ముంచేసిన సీఎం జగన్.. ఆ కేసులో కావాలనే ఇరికించారా?

Union Minister Piyush Goyal: వైయస్సార్ కాలనీ పట్ల కేంద్రమంత్రి పియూష్ గోయెల్ తన ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో పీయూష్ గోయల్ విలేకరులతో మాట్లాడుతూ జగన్ పాలనపట్ల విరుచుకుపడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్...
- Advertisement -
- Advertisement -