ఏపీలో ఆడుదాం ఆంధ్ర పోటీలకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ఎప్పటికప్పుడు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ విద్యార్థులు, యువతకు మేలు చేస్తున్న సంగతి తెలిసిందే. జగన్ సర్కార్ ఆడుదాం ఆంధ్ర పేరుతో క్రీడా పోటీలను నిర్వహిస్తుండగా డిసెంబర్ నెల 15వ తేదీ నుంచి 2024 సంవత్సరం ఫిబ్రవరి 3వ తేదీ వరకు ఈ పోటీలు జరగనున్నాయి. 15 సంవత్సరాల వయస్సు పైబడిన విద్యార్థులు, యువతను క్రీడల్లో ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది.

క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, కబడ్డీ, ఖో ఖోలను పోటీ క్రీడలుగా ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తుండగా యోగ, టెన్నికాయిట్, మారథాన్ లను పోటీ లేని క్రీడలుగా నిర్వహిస్తోంది. మొత్తం 51 రోజుల పాటు ఈ పోటీలు జరగనుండగా 2.99 లక్షల మ్యాచ్ లను నిర్వహించనున్నారు. మొదట గ్రామ, వార్డ్ స్థాయిలో పోటీలను నిర్వహించి గెలిచిన టీమ్ ను మండల స్థాయికి ఎంపిక చేస్తారు. ఆ తర్వాత నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో పోటీలు జరుగుతాయి.

ఈ పోటీలలో గెలిచిన వారికి సర్టిఫికెట్లు, ట్రోఫీస్ తో పాటు పతకాలను అందజేయడం జరుగుతుంది. నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్రస్థాయిలో ప్రతిభ చూపిన వాళ్లకు నగదు బహుమతులను అందజేస్తారు. క్రీడా సామాగ్రిని ప్రభుత్వం అందజేస్తుండటంతో పోటీలలో పాల్గొనే యువతకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇప్పటికే పోటీల నిర్వహణకు అవసరమైన మైదానాల, స్టేడియాల ఎంపిక ప్రక్రియ పూర్తైంది.

ఈ నెల 27వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కాగా సమీపంలోని గ్రామ, వార్డ్ సచివాలయాన్ని సందర్శించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆన్ లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని భావించే వాళ్లు https://aadudamandhra.ap.gov.in/ వెబ్ సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 1902 నంబర్ కు కాల్ చేయడం ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఫిబ్రవరి 3వ తేదీన విశాఖలో రాష్ట్ర స్థాయి పోటీలను నిర్వహించనున్నారు. విద్యార్థులు, యువతను క్రీడల విషయంలో ప్రోత్సహిస్తున్న జగన్ సర్కార్ పై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Bandla Ganesh-Roja: రోజా పులుసు పాప.. బండ్ల గణేష్ లేకి వ్యాఖ్యలు ఎంతవరకు రైట్ అంటూ?

Bandla Ganesh-Roja: సినీ నటుడు నిర్మాత బండ్ల గణేష్ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పట్ల అదే విధంగా ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం...
- Advertisement -
- Advertisement -