Nara Lokesh: సీఐడీ నెక్స్ట్ టార్గెట్ లోకేశ్.. 2024 ఎన్నికల నాటికి టీడీపీ నేతలంతా జైల్లో ఉంటారా?

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుని స్కిల్ డెవలప్స్ స్కామ్ లో భాగంగా అరెస్టు చేసి రాజమండ్రి జైలుకు పంపించారు. గత 17 రోజుల నుంచి ఈయన రాజమండ్రి చెల్లెలు ఖైదీ గానే ఉన్నారు. ఇప్పటికి ఈయనకు బెయిల్ రాకపోవడం ఈయన వేసినటువంటి పిటిషన్లను కోర్టు తిరస్కరించడం చూస్తుంటే చంద్రబాబు ఇప్పుడప్పుడే బయటకు వచ్చేలాగా కనిపించడం లేదు.

ఇలా చంద్రబాబు నాయుడు అరెస్టును జర్నించుకోలేకపోతున్నటువంటి కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీ నేతలకు త్వరలోనే సిఐడి మరో బిగ్ షాక్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. త్వరలోనే నారా లోకేష్ అరెస్టుకు కూడా రంగం సిద్ధమైందన్న వార్తలు వస్తున్నటువంటి తరుణంలో లోకేష్ ఏకంగా ఢిల్లీ వెళ్లి కూర్చున్నారు. ఢిల్లీ వెళ్లినటువంటి ఈయన ఎక్కడ మీడియా సమావేశాలలో కూడా పాల్గొనడం లేదు.

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారా లోకేష్ ను ఏ 14గా పేర్కొంటూ ఏసీబీ కోర్ట్ లో సీఐడీ దాఖలు చేసిన మెమోలో పేర్కొంది. ఈ కేసులో ఇప్పటికే ఈ కేసులో చంద్రబాబు నాయుడు, నారాయణ, లింగమనేని వంటి వారిపై ఎఫ్ఐఆర్లో నమోదు అయ్యాయి. ఇక తాజాగా ఈ జాబితాలోకి లోకేష్ పేరును చేర్చడంతో త్వరలోనే లోకేష్ కూడా ఈ కేసులో భాగంగా అరెస్టు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఇలా వైఎస్ఆర్సిపి పార్టీ నేతలు నాయకుల ఒక్కొక్కరి బాగోతం బయట పెడుతూ అందరిని జైలు పాలు పంపించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని తెలుస్తుంది. ఇలాగే 2024 ఎన్నికల సమయానికి టిడిపి నేతలు అందరూ కూడా జైల్లో ఊచలు లెక్క పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని తెలుస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -