Anil Ravipudi: శ్రీలీల డ్యాన్స్ లు అడిగిన వాళ్లపై అనిల్ షాకింగ్ కామెంట్స్.. మానసిక స్థితి బాలేదంటూ?

 Anil Ravipudi: డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి తాజా చిత్రం భగవంత్ కేసరి. ఈ సినిమా అక్టోబర్ 19వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. బాలకృష్ణ కాజల్ అగర్వాల్ శ్రీ లీల హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా అక్టోబర్ 19వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

దసరా పండుగ సందర్భంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం ఎంతో మంచి సక్సెస్ అందుకోవడం జరిగింది. ప్రస్తుతం ఈ సినిమా కలెక్షన్ల పరంగా కూడా దూసుకోపోతుంది ఇలా ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకోవడంతో చిత్ర బృందం ప్రెస్ మీట్ నిర్వహించారు . ఇందులో భాగంగా రిపోర్టర్స్ అడిగే ప్రశ్నలకు చిత్ర బృందం సమాధానం చెప్పారు. ఈ క్రమంలోనే ఒక రిపోర్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడిని ప్రశ్నిస్తూ ఈ సినిమాలో శ్రీలీల డ్యాన్సులు లేవని చాలామంది రివ్యూలు రాశారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి అంటూ ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు అనిల్ రావిపూడి సమాధానం చెబుతూ నేను రివ్యూలను పెద్దగా పట్టించుకోను ఎందుకంటే మన నోటి నుంచి వచ్చే టాక్ కన్నా రివ్యూలు పెద్దగా ఎఫెక్ట్ చూపించవు సినిమా పాజిటివ్ వచ్చిందని తెలిస్తే చాలు ప్రేక్షకులు థియేటర్ కి వెళ్తారని అనిల్ రావిపూడి తెలియజేశారు. ఇక ఈ సినిమాలో శ్రీ లీల డాన్స్, గ్లామర్ మిస్ అయిందని రివ్యూ రాసిన వాళ్ళు కచ్చితంగా తన అభిమానులు అయి ఉంటారని తెలిపారు.

ఇలా శ్రీ లీల అభిమానులు ఆమె నుంచి మంచి డాన్సు చూడాలని కోరుకున్నారేమో ఒక ఫోబియాతో బాధపడుతున్నటువంటి అమ్మాయిని శివంగిలా చూడాలనీ భావించే తండ్రి కథలో డాన్సులు చూడాలి అనుకున్నారు అంటే వారి మానసిక పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు అంటూ ఈ సందర్భంగా అనిల్ రావిపూడి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -