Politics: అనిల్ యాదవ్ కు జగన్ కు పడట్లేదా.. అసలేం జరిగిందంటే?

Politics: ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఇప్పటికే నెల్లూరు పెద్దారెడ్లు జగన్ పై కయ్యానికి కాలుదువ్వుతున్నారు. ఆనం, కోటం రెడ్డి సహా పలువురు ఎమ్మెల్యేలు రెబల్ గా మారి పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. అయితే వీరిని సీఎం జగనే పంపించారనే ప్రచారం కూడా ఉంది. అలానే మరో ఎమ్మెల్యేను పొమ్మనక పొగపెడుతున్నారనే ప్రచారం నడుస్తోంది.

రాజకీయాలకు పెట్టింది పేరు నెల్లూరు. ఇక్కడ రెడ్లదే ఆదిపత్యం అని చెప్పక తప్పదు. 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో మెజారిటీ రెడ్లే. గత ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికే ఈ జిల్లా ప్రజలు పట్టం కట్టారు. కానీ ఇప్పుడు సంకేతాలు రివర్స్ అయ్యాయి. అది జగన్ మీద వ్యతిరేకమా లేక స్థానిక ఎమ్మెల్యేల మీదనా అనేది సస్పెన్స్ గా ఉంది.

 

ఐప్యాక్ టీంతో ఇంటర్నల్ సర్వే చేయిస్తున్నారు జగన్. గడపగడపకు కార్యక్రమాన్ని పెట్టి, ఇంటింటికి ఎమ్మెల్యేలను తిప్పతున్నారు. ఇందులో చాలా మంది యాక్టివ్ గా పాల్గొనటం లేదు. వీరిపై పలుమార్లు కన్నెర్ల చేశారు. కానీ మార్పు రాలేదు. వారికి నెక్ట్స్ ఎలెక్షన్ లో సీటు ఇవ్వరని డిక్లేర్ అయ్యింది. అందులో డైలాగులు అనిల్ కుమార్ ఉన్నారని ప్రచారం జరుగుతోంది.

 

అనిల్ కు వ్యతిరేకంగా ఆయన బాబాయ్ రూప్ కుమార్ ను జగన్ పరోక్షంగాప్రోత్సహిస్తున్నారని చెబుతున్నారు. నెల్లూరు జిల్లాలో అనిల్ కి తొలిదఫా మంత్రి పదవి రావడంతో ఆయన అతి చేశారు. దీంతో చాలా మంది దూరమైపోయారు. రెండో దఫా ఆయనకు మంత్రి పదవి పోయింది. అనిల్ బాబాయ్ రూప్ కుమార్ కు పార్టీలో ప్రాధాన్యం పెరిగింది. ఆయన డిప్యూటీ మేయర్ గా ఉన్నారు. అనిల్ అనుచురలులంతా రూప్ కుమార్ వైపు వెళ్లిపోయారు.

 

అనిల్ గెలుపోటముల సంగతి పక్కనపెడితే… ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయనకు కనీసం టికెట్ వస్తుందా లేదా అనే అనుమానాలు బలపడుతున్నాయి. ఇటీవల ఎమ్మెల్యే అనిల్ స్వయంగా టికెట్ విషయంలో నర్మగర్భంగా వ్యాఖ్యలు చేశారు. తనకు టికెట్ ఇవ్వనని సీఎం జగన్ చెప్పినా.. తాను గెటౌట్ అన్నా కూడా పార్టీనుంచి వెళ్లిపోను అన్నారు. మరీ చూడాలని అనిల్ పరిస్థితి వచ్చే ఎన్నికలకు ఎలా ఉంటుందో.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -