Ambati – Anil Yadav: అంబటి రాంబాబును ఇరికించేసిన అనిల్ కుమార్ యాదవ్.. సొంత పార్టీ నేత వల్లే పరువు పోయిందిగా!

Ambati – Anil Yadav: ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం గడచిన ఐదేళ్ల కాలంలో ఏ ఒక్క అభివృద్ధి పనులను కూడా చేయలేక పూర్తిగా విఫలమైందని చెప్పాలి. తాము అధికారంలోకి వస్తే పోలవరం లాంటి ప్రాజెక్టులను పూర్తి చేసి చూపుతామంటూ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రగల్బాలు పలికారు. అయితే ప్రస్తుతం పోలవరం పనులను కూడా ఈ గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో పూర్తి చేయలేక పోయింది.

వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సమయానికి పోలవరం దాదాపు 70% పనులను పూర్తి అయ్యాయి. మిగిలిన 30 శాతం పనులను కూడా ఈ ఐదేళ్ల కాలంలో పూర్తి చేయటానికి వైసిపి ప్రభుత్వం వెనకడుగు వేసిందని తెలుస్తుంది. ఎప్పుడైతే డయాఫ్రమ్ వాల్ కూలిపోయిందో అప్పటినుంచి ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు ఆగిపోయాయి. అయితే ఈ ప్రాజెక్టు పూర్తి కాకపోవడంలో తన తప్పు ఏమీలేదని తప్పు మొత్తం అంబటి రాంబాబుదేనంటూ అనిల్ కుమార్ యాదవ్ తనపై తోసివేశారు.

వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండున్నర సంవత్సరాల పాటు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇంటర్వ్యూలో భాగంగా ఈయనకు పోలవరం పనుల గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ ప్రశ్నకు అనిల్ సమాధానం చెబుతూ అంబటి రాంబాబుదే తప్పని చెప్పకనే చెప్పేశారు.

తాను నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న సమయంలో అభివృద్ధి పనులు పూర్తిగా జరిగాయని ప్రాజెక్ట్ నిర్మాణ పనులు కూడా వేగంగా జరిగాయని తెలిపారు ఇక నేను ఈ మంత్రి పదవి నుంచి తప్పుకున్న తర్వాత కేవలం తన నియోజకవర్గ పరిధిలో మాత్రమే పర్యటిస్తూ ఉన్నానని ఈయన చెప్పడంతో తర్వాత వచ్చినటువంటి నీటి పారుదల శాఖ మంత్రి అంబంటి రాంబాబు ఏమి చేయలేకపోయారంటూ ఈయన చెప్పకనే చెప్పేశారు ఇలా సొంత పార్టీ నేతల వల్ల పార్టీ పరువు మొత్తం గంగాలో కలిసిపోయిందని చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -