Nara Lokesh: వైసీపీ సిద్ధం సభలో జనమంతా గ్రాఫిక్స్.. ఆధారాలతో సహా లోకేశ్ ప్రూవ్ చేశాడుగా!

Nara Lokesh: ప్రధాని మోడీ నా కంటే గొప్ప నటుడు అని విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ పలు సార్లు సెటైర్లు వేశారు. అంతేకాదు.. ఆయన యాక్టింగ్‌లో ఉంటే భారతదేశానికి ఎప్పుడో ఆస్కార్ వచ్చి ఉండేదని అంటూ ఉంటారు. ఈ మాటలు ఇప్పుడు ఎందుకు గుర్తు చేయాల్సి వస్తోందంటే.. ప్రకాశ్ రాజ్ ప్రధానిపై సెటైర్లు వేస్తే.. అలాంటి సెటైర్లే ఇప్పుడు వైసీపీ నేతలపై పడుతున్నాయి. వైసీపీ నేతలు గొప్ప క్రియేటర్లు అని సోషల్ మీడియాలో వ్యంగ్యాస్త్రాలు సందించిస్తున్నారు. నిజంగా వైసీపీ నేతలే సినిమా రంగంలో క్రియేటివ్ డిపార్టెమెంట్‌లో ఉంటే.. తెలుగు చిత్రపరిశ్రమ ఎప్పుడో అంతర్జాతీయ స్థాయికి ఎదిగిపోయి ఉండేదని నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు.

దీనికి ప్రధాన కారణం మొన్న ప్రకాశం జిల్లాలో జరిగిన సిద్ధం చివరి సభ. ఈ సభకు లక్షలాది మంది వచ్చారని చూపించుకోవడానికి వైసీపీ చేసిన ప్రయోగం బోల్తా కొట్టింది. దెబ్బకు వైసీపీ నేతలు తెల్లమొఖాలు వేసుకొని నిలబడాల్సి వస్తుంది. దాన్ని కవర్ చేయలేక.. తప్పును ఒప్పుకోలేక తలలు పట్టుకుంటున్నారు. ప్రకాశం జిల్లా మేదరమెట్ల వద్ద మొదట వంద ఎకరాల్లో భారీ బహిరంగ సభను నిర్వహించాలని అనుకున్నారు. కానీ, అంత మంది జనం రారని భావించిన వైసీపీ సభను 50 ఎకరాల్లో నిర్వహించారు. మందు, బిర్యానీ, డబ్బు పంపిణీ చేసి జనాలను తరలించేందుకు ఆపసోపాలు పడ్డారు. కానీ.. సభా స్థలానికి చేరుకునే సరికి అనుకున్నంత మంది జనం లేరు. దీంతో.. వైసీపీలోని క్రియేటర్ల నిద్ర లేచారు. ఆ సభా స్థలంలో 2.5 లక్షల మంది పడతారన్నది అంచనా.

కానీ.. ప్రాంగాణం మొత్తం నిండలేదు. కాబట్టి గట్టిగా కొడితే లక్షమంది కంటే తక్కువే వచ్చారు. దీంతో జనం తండోపతండాలుగా వచ్చారని చెప్పడానికి టెక్నాలజీని వాడుకున్నారు. గతంలో ఎక్కడా చూడని విధంగా ముందుగానే సభాప్రాంగణం మొత్తం వీఎఫ్‌ఎక్స్‌ గ్రీన్‌ మ్యాట్‌ పరిచారు. గ్రీన్ మ్యాట్ ఉంది కనుక.. అక్కడ గ్రాఫిక్స్‌ సాయంతో లేని జనాభాను చూపించారు. ఇక అంతే.. జగన్ అనుకూల మీడియాలో 15–20 లక్షల మంది వచ్చారని ప్రచారం చేశారు. జగన్ ప్రసంగం లైవ్ కూడా లేట్ గా ఇచ్చారు. తన మాట్లాడుతున్న దానికి టీవీల్లో ప్రసారం అవుతున్న దానికి 20 నిమిషాలు ఆలస్యం ఉంది. ఈ 20 నిమిషాల్లో ట్రాఫిక్స్ మాయాజాలం చూపించారు. అయితే, తప్పు ఆ ఫోటోలు, వీడియోలు పరిశీలిస్తే.. అవి గ్రాఫిక్స్ మాయాజాలం అని తెలుస్తోంది. ఒకే రకమైన గుంపులను సభలో ఖాళీగా ఉన్న చోట పెట్టేశారు. అది ఫోటోల్లో క్లియర్‌గా కనిపిస్తోంది. ఆ ఫోటోలను నారా లోకేష్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇప్పుడు వైరల్ అవుతున్నారు.

సభలో డ్రోన్ కెమెరాతో వీడియో తీయడానికి అధికారికంగా అనుమతి ఇచ్చారు. అయితే.. ఆ విషయం తెలియక అంబటి రాంబాబు, అనిల్ కుమార్ యాదవ్ దాన్ని నారాలోకేష్ పంపించారని రెచ్చిపోయారు. ఇద్దరు నేతలు గట్టిగా మాట్లాడటంతో పోలీసులు ఆ కెమెరాను, ఆపరేటర్ ను పట్టుకోగా.. డ్రోన్ ఎగరేసింది ఐప్యాక్ టీం అని తేలింది. దీంతో.. వైసీపీ నేతలు సైలంట్ అయ్యారు. మొత్తానికి వైసీపీ చేసిన గ్రాఫిక్స్ కి క్రియేటివ్ ఫీల్డ్ లో ఉన్నవారు కూడా అవాక్కు అవుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -