Veligonda Project: జగన్ వెలిగొండ కట్టేశానంటే నమ్మే జనం ఉన్నారా.. ఆయన మాటకు విలువ లేదంటూ?

Veligonda Project: జరగని పనులు జరిగినట్టు.. గత పాలకుల క్రెడిట్ కూడా తన ఖాతాలో వేసుకునే ప్రయత్నాలు ఏపీ సీఎం జగన్ చేస్తున్నారు. ఏపీకి పరిశ్రమలు క్యూ కడుతున్నాయని.. ఉద్యోగాలు వరదలా పారుతున్నాయని విశాఖలో జగన్ చెప్పారు. ఏకంగా 36 లక్షల మందికి తాము ఐదేళ్లలో ఉపాధి కల్పించామని చెప్పారు. నిజానికి పరిశ్రమలు, ఉద్యోగాలు, అభివృద్ధి అనే మాట ఐదేళ్లుగా జగన్ నోట వినిపించలేదు. కానీ, ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కనుక ఇటీవల పారిశ్రామిక వేత్తలతో మీటింగులు, ఉద్యోగాలు చేస్తున్న యువతలో మీటింగులు పెడుతున్నారు. దీంతో.. డెవెలప్మెంట్ పై జగన్‌కు ఓ విజన్ ఉందని ప్రజలు అనుకోవాలనేది ఆయన వ్యూహం. కంపెనీలు వచ్చాయి. ఉద్యోగాలు వచ్చాయి అంటే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఉద్యోగాలు పొందిన వారు మాత్రమే ఓటు వేస్తారు. ఎవరికో ఉద్యోగం వచ్చిందని మిగిలిన వారు వేయరు కాదా? ఆ విషయాన్ని మరచి ఏకంగా 36 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని జగన్ ప్రచారం చేస్తారు. ఈ విషయాన్ని మరవక ముందే వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభించారు. ఏపీ సీఎం జగన్ చర్యలన్నీ విచిత్రంగా ఉంటాయి. మనుషులు లేకపోయినా అటు వైపు చూసి అభివాదం చేయడం.. ఏడుస్తున్న వారిని చూసిన నవ్వడం చాలా విచిత్రమైన ధరణిని కనబరుస్తూ ఉంటారు. అలాంటి కోవలోకే కొత్తగా ప్రారంభించిన వెలుగొండ ప్రాజెక్టు కూడా వస్తుంది. ఎందుకంటే.. పూర్తి కాని ప్రాజెక్టును జగన్ ప్రారంభించారు. గత ఐదేళ్లులో జగన్ ప్రభుత్వం ఇరిగేషన్ శాఖపై కనీసం దృష్టి పెట్టలేదు. అందుకే.. ఏపీకి జీవనాడి లాంటి పోలవరంలో కదలిక లేదు. ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే.. ఎదురుదాడి చేయడం తప్ప పని చేసింది లేదు. సమాధానం చెప్పింది లేదు. పోలవరం ప్రతిపక్షం అసెంబ్లీ సాక్షిగా ప్రశ్నిస్తే.. అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చేసి వెటకారం ఇంకా ఏపీ ప్రజల గుర్తు ఉంది. వెయిటో.. వెయిటో అంటూ చాలా వెటకారంగా మాట్లాడారు. నిజంగానే పోలవరం పూర్తి చేస్తారోమే అని ప్రజలు వెయిట్ చేశారు కానీ.. అప్పటి మంత్రి వర్యులు మాత్రం వెయిట్ చేయకుండా మంత్రి పదవిని వదిలేసి వెళ్లిపోయారు.

ఆ తర్వాత వచ్చిన ఇరిగేషన్ మంత్రి పోలవరం ఎప్పుడు పూర్తి అవుతుందో తెలియదని చేతులెత్తేశారు. దీంతో పోలవరం విషయంలో అబద్దం చెప్పలేరు. ప్రాజెక్టు పూర్తి అయిందా? లేదా? అందరికీ ఈజీగా తెలుస్తోంది. అందుకే, వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసినట్టు చెప్పుకుంటున్నారు. కానీ, దానికి ఓ రూపం కూడా రాలేదు. ప్రాజెక్టు ద్వారా కానీ.. సొరంగం ద్వారా కానీ ఒక్క చుక్కు నీరు పంపింగ్ చేసింది లేదు. కానీ ఏదో సాధించినట్టు జగన్ చెబుతున్నారు. తన తండ్రి ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తే.. తాను పూర్తి చేసి ప్రారంభించానని ప్రచారం చేస్తున్నారు. నిజానికి దానికి మొదట శంకుస్థాపన చేసింది చంద్రబాబు. ఆ తర్వాత కాంగ్రెస్ పదేళ్లు అధికారంలో ఉన్నా.. దానికి అతీగతీ లేదు. మళ్లీ 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వెలుగొండ పనులు పరుగులు పెట్టాయి. ఇంతలోనే 2019లో మళ్లీ ప్రభుత్వం మారింది. జగన్ సీఎం అయిన తర్వాత రివర్స్ టెండరింగ్ పేరుతో ఆ పనులు మేఘా కంపెనీకు అప్పగించారు. కానీ, పనులు జరగలేదు. యంత్రాలతో చేయాల్సిన పనులను సైతం మనుషులతో చేయిస్తున్నారు.

ఏపీలో వందకోట్ల లోపే ఖర్చు చేస్తే పూర్తి అయ్యే దశలో చాలా నీటిపారుదల ప్రాజెక్టులు ఉన్నాయి. కానీ, జగన్ సర్కార్ ఆ దిశగా అడుగులు వేయడం లేదు. గుండ్లకమ్మ ప్రాజెక్ట్ గేటు కొట్టుకుపోతే పెట్టించడం కూడా వైసీపీ సర్కార్ కు చేతకాలేదు. దీని వలన వేల మంది రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అయినా పట్టించుకున్న నాదుడే లేడు. సొంత జిల్లాలో అన్నమయ్య డ్యాం కొట్టుకుపోతే టెండర్లు పిలిచి అస్మదీయులకు అడ్వాన్సులు ఇచ్చారు కానీ.. పనులు మాత్రం ముందుకు కదల లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే కొద్ది మొత్తంలో ఖర్చు చేస్తే చాలా ప్రాజెక్టులు పూర్తి అవుతాయి. కానీ జగన్ వాటిపై దృష్టి పెట్టకుండా.. అవి పూర్తి అయినట్టు కలరింగ్ ఇస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -