Lord Shiva: శివుడికి ఈ విధంగా అభిషేకం చేస్తే ఎంతో పుణ్యం.. ఏం చేయాలంటే?

Lord Shiva: హిందువులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుణ్ణి భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. అలా సోమవారం రోజున పరమేశ్వరుడిని ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటారు. సోమవారం ఆ భోళా శంకరుడికి ప్రత్యేకమైన రోజు. ఆరోజు నా భక్తిశ్రద్ధలతో స్వామివారిని పూజించడం వల్ల కోరిన కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి. శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఆ రోజున కొన్ని రకాల పదార్థాలతో శివుడికి అభిషేకం చేయడం వల్ల అనుకున్న పనులు జరగడంతో పాటు సమస్యలన్నీ తీరిపోతాయి.

అందుకే ఈరోజు కొన్ని పదార్థాలతో శివాభిషేకం చేస్తే మంచి ఫలితాలు దక్కుతాయి. శివుడు తెల్లటి వస్తువులతో సంబంధం కలిగి ఉంటాడు. పాలు, పెరుగు, పంచదార, బియ్యం మొదలైన వస్తువులతో అభిషేకం చేయాలి. జీవితంలో ఉన్న సమస్యలు అన్ని తొలగిపోతాయి. శివుడికి పచ్చి పాలతో శివునికి అభిషేకం చేయడం వల్ల ఇంట్లో గొడవలు, మనస్పర్థలు దూరమవుతాయి. కుటుంబంలో శాంతి నెలకొంటుంది. కార్యాలయంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. టెన్షన్, ఆందోళన వంటివి తొలగిపోతాయి. అలాగే సోమవారం పెరుగుతో శివునికి అభిషేకం చేయడం వల్ల జీవితంలోని అన్ని అడ్డంకులు తొలగిపోతాయి.

 

అసంపూర్తిగా ఆగిపోయిన పనులు కూడా పూర్తవుతాయి. జీవితంలో ఆనందం, శ్రేయస్సు లభిస్తుంది. మీరు అనుకున్న పనులు పూర్తవుతాయి. సోమవారం ఆ మహాశివుడికి చక్కెరతో అభిషేకం చేయడం వల్ల తెలివితేటలు, ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. జీవితంలో ఉన్న కష్టాలు తొలగిపోతాయి. అలాగే శివుడికి వెన్నతో అభిషేకం చేయడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు లభిస్తాయి. సంతాన సంతోషాన్ని పొందలేని దంపతులు సంతాన సుఖాన్ని పొందుతారు. సంతానం పొందేందుకు ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: ఉప్మాకు అమ్ముడుపోవద్దంటూ పవన్ కళ్యాణ్ సెటైర్లు.. ఆ ఉప్మా ఎవరంటే?

Pawan Kalyan:  ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పవన్ కళ్యాణ్ తన ప్రచారం లో జోరు, ప్రసంగాలలో హోరు పెంచుతున్నారు. తనదైన స్టైల్ లో ప్రతిపక్షం వారిని విమర్శిస్తూ కూటమి అధికారంలోకి వస్తే...
- Advertisement -
- Advertisement -