Ram Charan: చరణ్ పరువు తీస్తున్న తమిళ మీడియా.. చరణ్ పై ఇన్ని పుకార్లు ఏంటి అంటూ?

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రామ్ చరణ్ గత ఏడాది విడుదల అయిన ఆర్ఆర్ఆర్ మూవీతో పాన్ ఇండియా స్టార్ గా మారడంతో పాటు గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో రామ్ చరణ్ క్రేజ్,డిమాండ్ మరింత పెరిగింది. దీంతో రాంచరణ్ తో సినిమాలో చేయడం కోసం అన్ని భాషల ఫిలిం మేకర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. అంతే కాకుండా అన్ని భాషల మీడియా సంస్థలు కూడా చరణ్ పై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కొన్ని మీడియా సంస్థలు రామ్ చరణ్ పై లేనిపోని వార్తలను సృష్టిస్తున్న విషయం తెలిసిందే.

మరి ముఖ్యంగా తమిళ మీడియా రామ్ చరణ్ పై ఇష్టం వచ్చిన విధంగా వార్తలు రాస్తూ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తోంది. ఇటీవల రామ్ చరణ్ తమిళ్ సూపర్ స్టార్ విజయ్ సినిమా లియో లో కీలక పాత్రలు కనిపించబోతున్నాడు అంటూ తమిళ్ మీడియాలో వచ్చిన పుకారు జాతీయ స్థాయిలో సందడి చేసింది. లియో సినిమా హైప్ పెంచడం కోసం చరణ్ గెస్ట్ పాత్రలో కనిపించబోతున్నాడని పుకార్లను తమిళ్ మీడియా సృష్టించింది అంటూ కొందరు మెగా కాంపౌండ్ కు చెందిన వారు ఆఫ్ ది రికార్డు మాట్లాడుకుంటున్నారు. కానీ లియో సినిమాలో చరణ్ పాత్ర లేదు. చరణ్ కనిపించడు అంటూ స్పష్టతనిచ్చారు. అయినప్పటికీ రామ్ చరణ్ పై వస్తున్న వార్తలు మాత్రం ఆగడం లేదు. ఇది ఇలా ఉంటే తాజాగా మరో పుకారు ప్రేక్షకులను, ని అభిమానులను ఆలోచింపజేస్తోంది.

ఇంతకీ ఆ పుకారు ఏంటంటే.. రామ్ చరణ్ ప్రస్తుతం తమిళ దర్శకుడు శంకర్ తో గేమ్ చేంజర్ సినిమాను చేస్తున్నారు. ఆ సినిమా తర్వాత వెంటనే ఇండియన్ 3 సినిమాను చెర్రీ తో చేసేందుకు శంకర్ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడు అనేది తమిళ్ మీడియాలో వినిపిస్తున్న మరొక రూమర్. తమిళ్ మీడియా వారు ఈ విషయమై అత్యుత్సాహంతో భారీగా కథనాలను అల్లేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలి అంటే తమిళ మీడియా రామ్ చరణ్ పరువును తీసేస్తోంది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో చెర్రీ పై ఇన్ని పుకార్లు ఏంటి అంటూ నెటిజన్స్,అభిమానులు మండి పడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -