Anushka: అలా చేయడం ప్రభాస్ కు అస్సలు చేతకాదు.. వైరల్ అవుతున్న అనుష్క సంచలన వ్యాఖ్యలు!

Anushka: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి గురించి మనందరికీ తెలిసిందే. అనుష్క పేరు వినగానే ఆమె నటించిన జేజమ్మ, భాగమతి, దేవసేన వంటి పాత్రలు గుర్తుకు వస్తాయి. తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది. ఇకపోతే అనుష్క శెట్టి తాజాగా నటించిన చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి. ఈ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో నవీన్ పొలిశెట్టి హీరోగా నటించారు. మెసేజ్ ఓరియెంటెడ్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను రూపొందించారు.

ఇందులో కామెడీ వేరే లెవల్ అని తెలుస్తోంది. గత రెండు మూడు వారాలుగా ఈ సినిమా పేరు ఎక్కడ చూసినా కూడా మారుమోగిపోతోంది. చిత్ర బృందం ఈ సినిమాకు సంబంధించి జోరుగానే ప్రమోషన్లు చేశారు. వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ సినిమాను ప్రేక్షకులలోకి తీసుకెళ్లారు. ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అనుష్క శెట్టి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. హీరో ప్రభాస్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న అనుష్కకి ప్రభాస్ పై ప్రశ్నలు ఎదురైయాయి. ఈ క్రమంలోనే అనుష్క స్పందిస్తూ..

ప్రభాస్ నాకు బెస్ట్ ఫ్రెండ్, చాలా చాలా డియరెస్ట్ ఫ్రెండ్ అని చాలా మంచి క్యారెక్టర్ ఎదుటివారిని హర్ట్ చేయడం ప్రభాస్ కి రాదని.. ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతాడు. బాధ ఉన్న సరే తానే ఆ బాధను అనుభవిస్తాడు తప్పిస్తే తన వల్ల వేరే వాళ్ళు హర్ట్ అవ్వడం ఆయనకు ఇష్టం లేదు. ఇప్పటివరకు ప్రభాస్ ఎప్పుడు అలా చేయలేదని అని తెలిపింది అనుష్క. ప్రస్తుతం అనుష్క చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా అనుష్క ప్రభాస్ కాంబినేషన్ లో డార్లింగ్, బాహుబలి 1, బాహుబలి 2 సినిమాలు విడుదలైన విషయం తెలిసిందే.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -