YS Jagan Mohan Reddy: మరో ‘సాక్షి’.. జగన్ కొత్త మీడియా ఛానెల్

 YS Jagan Mohan Reddy: రాజకీయాల్లో మీడియా పాత్ర కీలకం అని చెప్పవచ్చు. రాజకీయ పార్టీలకు మీడియా అండ అనేది చాలా ముఖ్యం. ప్రజల్లోకి తమ భావాలను బలంగా తీసుకెళ్లడానికి పార్టీలకు మీడియా సపోర్ట్ అనేది అవసరం. తమ పార్టీ వైపు ఓట్లర్లను ఆకర్షించేందుకు, ప్రజల్లోకి బలంగా పార్టీని తీసుకెళ్లేందుకు మీడియా అనేది ఏ పార్టీకైనా అవసరమే. అందుకే మీడియాను మిచ్చిక చేసుకునేందుకు పార్టీలన్నీ ప్రయత్నిస్తూ ఉంటాయి. మీడియా ఛానెళ్లకు తమ పార్టీ నుంచి ఫండింగ్ ఇస్తూ ఉంటాయి. తమకు సపోర్ట్ చేసే పార్టీలకు పరోక్షంగా సహకరిస్తూ ఉంటాయి. అధికారంలో ఉన్న పార్టీలు అయితే మీడియా ఛానెళ్లకు ప్రకటనలు, ప్రభుత్వానికి సంబంధించిన లైవ్ ప్రసారాలు, తమ పార్టీ యాడ్స్ ద్వారా నిధులు సమకూరుస్తాయి. తెరవెనుక జరిగిందే ఇదేనని అందరికీ తెలిసిన సత్యమే.

తెలుగు రాష్ట్రాల్లో టీడీపీకి ఉన్నంత మీడియా బలం మరే ఏ పార్టీకి లేదని చెప్పవచ్చు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, మహాన్యూస్ తో పాటు మరికొన్ని ఛానెళ్లు టీడీపీకి బహిరంగంగానే సపోర్ట్ చేస్తున్నాయి. ఇక వైసీపీ విషయానికొస్తే.. సొంత ఛానెల్ సాక్షి ఎలాగూ ఉంది. దీంతో పాటు ఎన్టీవీ, 10టీవీ లాంటి మీడియా ఛానెళ్లు వైసీపీకి అండగా ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం ఉంది. ఏపీలో అధికార టీడీపీతో పొలిస్తే వైసీపీకి మీడియా బలం కాస్త తక్కువనే చెప్పాలి.

దీంతో మరో కొత్త ఛానెల్ ఏర్పాటుకు జగన్ అడుగులు వేస్తున్నారు. ప్రభుత్వ తరపున మీడియా ఛానెల్ పెట్టే ఆలోచనలో ఉన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు తెలిసేందుకు, ప్రభుత్వ సమాచారాన్ని ప్రజలకు తెలియజేందుకు ఈ మీడియా ఛానెల్ ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వంలో ఉంది కనుక.. తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను ఈ ఛానెల్ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. అంటే ఒకరకంగా వైసీపీ ప్రభుత్వానికి ఈ చానెల్ ఉపయోగపడనుందన్న మాట. వివిధ సంక్షేమ పథకాలను గత ప్రభుత్వంలో ఖర్చు చేసిన నిధులతో పోలుస్తూ.. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విడుదల చేసిన నిధులను తెలియజేయనున్నారు.

ఇక వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమం, అభివృద్ధి పరంగా జరిగిన మార్పులను ఈ ప్రభుత్వ ఛానెల్ ద్వారా ప్రజలకు తెలపున్నారు. ప్రభుత్వ చానెల్ కనుక ప్రభుత్వ నిధులతోనే ఏర్పాటు చేయనున్నారు. ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ తరపున చానెల్ ను ఏర్పాటు చేసేందుకు తన బంధువు గౌతంరెడ్డి ప్రయత్నాలు చేశారు. ఇటీవల గౌతంరెడ్డిని ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించారు. దీంతో ఆయన ఈ కొత్త ఛానెల్ పనులను చూసుకుంటున్నారు.

త్వరలోనే ఈ చానెల్ ను ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి. ఎన్నికలకు ముందు ఈ చానెల్ ను ప్రారంభించడం ద్వారా పరోక్షంగా వైసీపీకి లబ్ది చేకూరనుంది. సాక్షిలో పనిచేసే జర్నలిస్టులనే ఈ చానెల్ లో ఉపయోగించుకోనున్నారు. ఈ చానెల్ లో ప్రభుత్వ పథకాలతో పాటు వివిధ ప్రభుత్వ కార్యక్రమాలు ఉండనున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -