Amaravati: ఎకరాల్లెక్కన అమరావతి భూముల వేలానికి సిద్ధం.. సీఎం జగన్ ప్లాన్ మామూలుగా లేదుగా!

Amaravati: ఒకప్పుడు అమరావతిని స్మశానం అన్న సీఎం జగన్ ఇప్పుడు అవే భూములని వేలానికి పెట్టి డబ్బులు సంపాదించాలని చూస్తున్నాడు. తాజాగా రాజధాని లో భూముల అమ్మకం కోసం జగన్ ప్రభుత్వం 389, 390 జీవోలు జారీ చేసింది. స్పెషల్ జోన్ లో ఉన్న మంగళగిరి మండలం నవ్వులూరు రెవెన్యూలో 10 ఎకరాలు, తుళ్లూరు మండలం పిచ్చుకల పాలెం రెవెన్యూలో నాలుగు ఎకరాలని అమ్మకానికి పెట్టారు. స్పెషల్ జోన్ లో ఉన్న రాజధాని భూములను ఈ వేలం ద్వారా అమ్మేందుకు ఏర్పాటు చేస్తున్నారు.

ఈ మేరకు సి ఆర్ డి ఏ వేలం ప్రకటన జారీ చేసింది. అయితే ఇదంతా అమరావతి అభివృద్ధి కోసమే చేస్తున్నట్లుగా సీఆర్డీఏ అధికారులు చెప్తున్నారు. అయితే నిజానికి అమరావతిని రాజధానిగా వినటానికి కూడా ఒప్పుకోలేదు జగన్మోహన్ రెడ్డి. అందుకే ఏపీకి మూడు రాజధానులు అనే కొత్త నినాదాన్ని తీసుకువచ్చారు. ఎట్టి పరిస్థితులలోనూ అమరావతి రాజధాని కాకూడదన్నదే వైసీపీ నినాదం. అందుకే కమ్మ రాజధాని, రాజధాని భూములలో అవినీతి ఇలా ఎన్నెన్నో కారణాలు చెబుతూ సీఎం జగన్ ఇప్పటివరకు కాలం గడిపేశారు.

అమరావతిని ఎంత అభివృద్ధి చేసినా క్రెడిట్ మొత్తం చంద్రబాబు నాయుడుకి వెళ్తుంది అనే ఒక ఆలోచనతోనే అమరావతిపై సీత కన్ను వేశారు జగన్. వైసీపీ నేతలు సైతం అమరావతిని రాజధానిగా ఒప్పుకునే పరిస్థితుల్లో లేరు. రైతులు తమ బాధ ఎన్ని రకాలుగా విన్నవించుకున్నా, కోర్టులు ఎన్ని మొట్టికాయలు వేసినా అస్సలు చలించలేదు జగన్ ప్రభుత్వం. ఆఖరికి అమరావతిని స్మశానంతో కూడా పోల్చిన సంగతి అందరికీ తెలిసిందే.

మరి అలాంటి స్మశానం భూములు ఇప్పుడు అమ్ముకోవడానికి పనికి వస్తున్నాయా అంటూ నిలదీస్తున్నారు రైతులు. తమ కౌలు డబ్బులు ఇంకా ఎకౌంట్లో వెయ్యలేదు కానీ భూములు మాత్రం వేలానికి పెట్టారు. ఇదంతా భూమిని తన వర్గం వారికి అందించడం కోసం జరుగుతున్న కుట్ర అని రైతుల సైతం వాపోతున్నారు. చూడాలి మరి భూములను జగనన్న వేలం వేస్తాడా లేదంటే అమరావతి రైతులు భూములపై కోర్టులో స్టే తెచ్చుకుంటారా అనేది వేచి చూడాల్సిందే.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -