Sharmila: క్రైస్తవుడై మణిపూర్ పై ఎందుకు మాట్లాడలేదు.. షర్మిల కామెంట్స్ వైరల్!

Sharmila: తాజాగా ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి పై మండిపడ్డారు. మణిపుర్‌లో రెండువేల చర్చిలు ధ్వంసం చేసినా, 60 వేల మంది క్రైస్తవులకు నిలువనీడ లేకుండా చేసినా క్రైస్తవుడైన జగన్‌ ఎందుకు ఈ విషయం పట్ల మాట్లాడలేదు అని ఆమె ప్రశ్నించారు. ఇంత జరిగినా భాజపాకు మద్దతు ఇవ్వడం ఏంటని ఆమె జగన్‌పై ఆగ్రహం వ్యక్తంచేశారు. విజయవాడలో ఆదివారం ఆమె ఏపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ సీఎం జగన్‌పై తీవ్రంగా మండిపడ్డారు. మణిపుర్‌ ఘటనపై జగన్‌ మాట్లాడకపోతే క్రైస్తవుల కడుపులు మండవా? వారికి మనసు లేదా? వారు మనుషులు కాదా? రాష్ట్రంలో అభివృద్ధి జరగకపోయినా దళితులపై దాడులు వందకు వంద శాతం పెరిగాయి.

ఎక్కడ చూసినా ఇసుక, లిక్కర్‌, మైనింగ్‌ మాఫియా, దోచుకోవడం, దాచుకోవడం ఇంతకంటే రాష్ట్రంలో ఏం జరిగింది? అని ప్రశ్నించారు. స్వలాభం కోసం రాష్ట్ర ప్రయోజనాలను జగన్‌ తాకట్టు పెట్టారు. ప్రతిపక్ష నేతగా ఉన్నపుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని రోజూ పోట్లాడారు. నిరాహార దీక్షలు కూడా చేశారు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడతామని మద్దతివ్వాలని తెదేపాను కోరారు. ఎంపీలు మూకుమ్మడి రాజీనామాలు చేస్తే ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూస్తానని అన్నారు. జగన్‌ రెడ్డి సీఎం అయ్యాక ఒక్కసారైనా ప్రత్యేక హోదా కోసం నిజమైన ఉద్యమం చేశారా? మనకు ప్రత్యేక హోదా కాదు కదా, కనీసం ప్యాకేజీ కూడా లేదు.

 

రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదంటే ఆ పాపం అధికార, ప్రతిపక్ష నేతలు జగన్‌, చంద్రబాబులదే. ఇద్దరూ ప్రజల ప్రయోజనాలను కేంద్రానికి తాకట్టు పెట్టారు. వైకాపా, తెదేపా దొందూ దొందే అంటూ ఆమె కాస్త ఘాటుగా విమర్శించారు. అయితే జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులు అన్నారు. మూడు కాదు కదా ఒక్కటి కూడా లేదు. ఈ రోజు రాజధాని ఏదంటే మనకే అర్థం కాని పరిస్థితి. రూ.కోట్ల అప్పులు చేసి రాజధాని కూడా కట్టలేకపోయారు. చంద్రబాబు హయాంలో అమరావతి రాజధాని అన్నారు. దాన్ని అభివృద్ధి చేశారా అంటే అదీ లేదు అంటూ షర్మిల ధ్వజమెత్తారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -