Chandrababu: చంద్రబాబు జీతం పెంచినా కూడా పాపమేనట.. వైసీపీ నేతల తీరు మరీ ఘోరంగా ఉందిగా!

Chandrababu: వైసీపీ ప్రతిపక్షాలపై విచిత్రమైన ప్రచారం చేస్తూ ఉంటుంది. పేదలకు ఏం చేశారు? మహిళకు ఏం ఇచ్చారని విపక్షాలను ప్రశ్నింస్తోంది. పేదల కోసం లేదా ఏదైనా వర్గం కోసం స్పష్టమైన హామీని విపక్షాలు ఇస్తే.. వాటిని నమ్మొద్దని గొంతు చించుకుంటుంది. చంద్రబాబు అధికారంలోకి వస్తే వాలంటీర్లను రద్దు చేస్తారని వైసీపీ జోరుగా ప్రచారం చేసింది. అయితే, చంద్రబాబు ఇలాంటి తప్పుడు ప్రకటనలకు గట్టిగా కౌంటర్ వేశారు. వాలంటీర్లను రద్దు చేసే ఆలోచన తమకు లేదని.. వాలంటీర్లకు 10 వేల జీతంతో కొనసాగిస్తామని ప్రకటించారు. దీంతో వైసీపీ నేతలకు ఏం చెప్పాలో తెలియక.. కొత్త కుట్రకు తెరలేపింది. ఇప్పటికైనా జగన్ తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థను అర్థం చేసుకున్నందుకు కృతజ్ఞతలు అని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ చేస్తున్నారు.

అయితే.. వైసీపీ నేతలకు ఓ విషయం చెప్పాలి. ఏదైనా వ్యవస్థను ఏర్పాటు చేయడం గొప్ప కాదు.. దాన్ని ప్రజాస్వామ్యయుతంగా వాడుకోవడం గొప్ప.. గత ప్రభుత్వాలు తీసుకొచ్చిన వ్యవస్థలను కంటిన్యూ చేయడం గొప్ప. అమరావతిని కంటిన్యూ చేస్తే చంద్రబాబు చిరస్థాయిగా నిలిచిపోతారని ఆలోచించి దాని ఆనవాళ్లు చెరిపివేసిన కుటిల బుద్ది జగన్ ది. కానీ.. వాలంటీర్ల జీవితం అలా అవ్వకూడదని వారి జీతం పెంచుతానని చంద్రబాబు ప్రకటించారు. ఇది పక్కన పెడితే.. చంద్రబాబు ప్రకటనపై పేర్నినాని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు మాటలు నమ్మొద్దిన పిలుపునిచ్చారు. గెలవడం కోసం ఆయన తప్పుడు హామీలు ఇస్తారని అన్నారు. నయవంచనకు చంద్రబాబు మారుపేరు అని పేర్నినాని విమర్శించారు.

అయితే, పేర్ని నాని కామెంట్స్ పై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. ఎవరిది నయవంచనా అని ప్రశ్నిస్తున్నారు. 2019 ఎన్నికలల్లో వైసీపీ వస్తే.. అమరావతి ఉండదని టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని జగన్ ఊరూరు తిరిగి చెప్పారు. కానీ.. అమరావతినే రాజధానిగా కొనసాగిస్తామని అన్నారు. కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని లేకుండా చేశారు. మరి దీన్ని ఏమంటారు? నవవంచన కాదా? వైసీపీని గెలిపిస్తే ప్రత్యేకహోదా తీసుకొని వస్తా అన్నారు. తీసుకొచ్చారా? ఇది నయవంచన కాదా? వెనకబడిన జిల్లాలకు ఏడాది 50 కోట్లు ఇవ్వాలని చట్టంలో ఉంది సాధించారా? కడప స్టీల్ ప్లాంట్ సాధించారా? దుగ్గిరాజపట్నం పోర్టు సాధించారా? విశాఖకు రైల్వే జోన్ చట్టంలో ఉంది సాధించారా? ఇది నయవంచన కాదా?

2019లో ఎన్నికల ముందు దశలవారీగా మద్యపాన నిషేదమని చెప్పి మాట తప్పారు. ఇది నయవంచన కాదా? ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తామని చెప్పి… అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకరికే అమ్మఒడి అని మాట మార్చారు. ఇది నయవంచన కాదా? ఉద్యోగులకు సీపీఎస్ రద్దు చేస్తామన్నారు. సీపీఎస్ రద్దు అయిందా? ఇది నయవంచన కదా? నిరుద్యోగలకు ప్రతీ ఏడాది జనవరిలో 6500 పోలీసులు ఉద్యోగాలు ఉన్నారు. ఇది నయవంచన కాదా? అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సీ అన్నారు. అది నయవంచన కాదా? నయవంచన గురించి వైసీపీ మాట్లడుతుందా?

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -