Chandrababu – Jagan: ఒక్కో సభకు రూ.15 కోట్ల ఖర్చు.. 1500 బస్సులు.. చంద్రబాబు ప్రశ్నకు జగన్ జవాబు చెబుతారా?

Chandrababu – Jagan: అందరూ నోటితో మాట్లాడితే.. నువ్వు మాత్రం నోట్లతో మాట్లాడుతావని మహేష్ బాబు నటించిన ఖలేజా సినిమాలో డైలాగ్. ఇప్పుడు జగన్ సభల పరిస్థితి కూడా అలాగే ఉంది. డబ్బుతోనే జగన్ బస్సు యాత్ర ముందుకు సాగుతోంది. జగన్ తో పాటు యాత్రలో నడిచేవారు ఎవరూ లేరు కానీ.. బహిరంగ సభలకు మాత్రం జనాలను తరలించడానికి తెగ ప్రయత్నిస్తున్నారు. ఇదే విషయంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి డబ్బు ఎవరు ఖర్చు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఒక్కో సభకు15వందల బస్సులు పెట్టి జగన్ సభలను నడిపిస్తున్నారని మండిపడ్డారు. బిర్యానీలు, మద్యం పంచి ప్రజలను తరలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కో సభకు 15 కోట్ల రూపాయలకు ఖర్చు చేస్తున్నారని..ఇలాంటివి పది సభలు నిర్వహించారని ఆక్షేపించారు. ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు? జగన్ ఏమైనా వ్యవసాయం చేస్తున్నారా? వ్యాపారం చేస్తున్నారా? అని ప్రశ్నించారు.

ఇంత ఖర్చు చేస్తున్నా ప్రజలు చీదర కొడుతున్నారని అన్నారు. సభలకు ఎవరూ రావడం లేదని సెటైర్లు వేశారు. జనాలు లేక గ్రాఫిక్స్ తో మేనేజ్ చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. జగన్ ఇంట్లో నోట్ల కౌంటింగ్ మిషన్ పెట్టి ఏ రోజు సంపాదన ఆరోజు లెక్కపెట్టుకుంటున్నారని అన్నారు. గనుల శాఖను పక్కన పెట్టి అయినకాడికి లూటీ చేయడానికే రాయల్టీ వసూలకు ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించారని ఆరోపించారు. ఇంత జరగుతున్నా.. ఓ అవినీతిపరుడైన సీఎంను కొన్ని ఛానెళ్లు వెనకేసుకొని వస్తున్నాయని విమర్శించారు. సమాజహితంపై ఏమాత్రం బాధ్యత లేని వారే ఇలాంటి వారిని వెనకేసుకొని వస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ సభలు మొత్తం పెయిడ్ సభలేనని అన్నారు. ఐ ప్యాక్ టీం పోగు చేసిన కొంతమందితో ఫోటోలు దిగి, వారిపై జగన్ వల్లమాలిన ఆప్యాయత చూపిస్తున్నారని అన్నారు. ప్రతీ రోజు ఏదో ఒక తప్పుడు ప్రచారం చేస్తూనే ఉంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ లు హద్దులు మీరుతున్నాయని ద్వజమెత్తారు.

వాలంటీర్లు కూడా సమాజహితం కోరే వారిపైపు ఉంటారో.. వ్యవస్థలను నాశనం చేస్తున్న వారి వైపు ఉంటారో తేల్చుకోవాలని చంద్రబాబు అన్నారు. వాలంటీర్ ఉద్యోగం చివరిది కాదని యువత గ్రహించాలని చెప్పారు. జీవతంలో అది తొలి అడుగు కావాలని అన్నారు. నైపుణ్య శిక్షణ ఇచ్చి వారికి మరిన్ని అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. పింఛన్లను నాలుగు వేలకు పెంచుతామని చెప్పారు. దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు ఇస్తామని అన్నారు. జగన్ తన జేబులోనించి డబ్బులు పంచడం లేదని గుర్తు చేశారు. ప్రజలు పన్నులు కడితేనే నగదు పంపిణీ జరుగుతోందని అన్నారు. పేదలను దృష్టిలో పెట్టుకొని ఆరు వరాలు ప్రకటించామని అన్నారు. మరింత లోతుగా అధ్యయనం చేసి పూర్తి మ్యానిఫెస్టోని విడుదల చేస్తామని చెప్పారు. వైసీపీ పాలనతో ఊరికో రౌడి పుట్టుకొస్తున్నాడని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రౌడీ రాజ్యాన్ని అంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రతీ ఒక్కరిలో ఆవేశం, బాధ, ఆగ్రహం కనిపిస్తున్నాయని చంద్రబాబు చెప్పారు. ఓటు రూపంలో ప్రజలు వారి ఆవేశాలను చూపించాలని అన్నారు. జగన్ పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు తీసుకుంటున్నారని విమర్శించారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -