AP Govt: ఏపీ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. వయో పరిమితిని 42 సంవత్సరాలకు పెంచిన జగన్ సర్కార్!

AP Govt: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇతర రిక్రూట్మెంట్ ఏజెన్సీలు నేరుగా భర్తీ చేసే నాన్ యూనిఫాం పోస్టులు యూనిఫామ్ పోస్టులకు అభ్యర్థుల వయోపరిమితిని రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. వయసు పైబడిన నిరుద్యోగులకు నిజంగా ఇది శుభవార్త. వయసు మీరిన నిరుద్యోగులకు మేలు చేకూర్చేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి కీలక నిర్ణయం తీసుకుందని సమాచారం.

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇతర రిక్రూట్మెంట్ ఏజెన్సీలు నేరుగా భర్తీ చేసే నాన్ యూనిఫారం పోస్టులు, యూనిఫారం పోస్టులకు అభ్యర్థుల వయోపరిమితిని రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. నాన్ యూనిఫారం పోస్టులకు అభ్యర్థుల వయోపరిమితిని 34 నుంచి 42 సంవత్సరాలు పెంచింది. యూనిఫాం పోస్టులకు ప్రస్తుతం ఉన్న వయోపరిమితికి అదనంగా రెండు సంవత్సరాల పెంచింది.

ఈ వయోపరిమితి పెరగటం వచ్చే సెప్టెంబర్ 30వ తేదీ వరకు వర్తిస్తుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె.ఎస్ జవహర్ రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు . ఇటీవలే కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ లో 35 స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు.

అభ్యర్థుల వయసు 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. రాత పరీక్ష, ద్రవ పాత్రల పరిశీలన, మెడికల్ పరీక్షలు ఆధారంగా అభ్యర్థులు ఎంపిక ఉంటుంది. దరఖాస్తు ఫీజుగా జనరల్, బీసీలకు 700 రూపాయలు గాను, ఎస్సీ, ఎస్టీ దివ్యాంగులు ఈ ఎక్స్ ఎం అభ్యర్థులకు 500 రూపాయలు గాను నిర్ణయించబడింది. దరఖాస్తు ఫీజు చెల్లించడానికి ఈనెల 21వ తేదీ చివరి తేదీ. నవంబర్ నెలలో రాత పరీక్షను నిర్వహిస్తారు. ప్రభుత్వం జారీ చేసే నోటిఫికేషన్లు ఆలస్యం అయితే గరిష్ట వయసు దాటిపోయిన అభ్యర్థులకు నష్టం జరగకుండా వయోపరిమితిని పెంచుతూ ప్రభుత్వం జీవోలు విడుదల చేయడం గమనార్హం.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -