AP Government: ఏపీ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు బంపర్ ఆఫర్.. బిల్లులు లేటైతే ఏకంగా వడ్డీతో ఇస్తామంటూ?

AP Government: తాజాగా ఏపీ సర్కార్ కాంట్రాక్టర్లకు ఒక అదిరిపోయే ఆఫర్ ను ఇచ్చింది. వచ్చే ఏడాది జరిగే ఎన్నికలలో మళ్లీ గెలుస్తాము అన్న నమ్మకాన్ని కోల్పోయిన ఏపీ ప్రభుత్వం బిల్లులు చెల్లించకుండా ఇప్పుడే ఖర్చు పెట్టేసే ప్రణాళికలు రెడీ చేస్తోంది. ఇందుకోసం కాంట్రాక్టర్లకు కొత్త తరహా ఒప్పందాలకు చాన్స్ ఇస్తోంది. ఇందులో విచిత్రమైన విశేషాలు ఉంటున్నాయి. ఒకవేళ బిల్లులు ఆలస్యం అయితే ఎంత లేట్ అయినా అంత తొమ్మిది శాతం వడ్డీ ఇస్తారట. ప్రభుత్వం సమయానికి బిల్లులు ఇవ్వకపోతే అప్పు ఖాతాగా భావించి ప్రభుత్వం వడ్డీ కూడా చెల్లిస్తుందట. అయితే మొదట ఈ ఆఫర్ తో కాంట్రాక్టర్ లు సంతోషపడినప్పటికీ ఈ విచిత్రమైన వ్యవహారం వెనుక ఏపీ ప్రభుత్వం కాడి దించేసే ప్లాన్లు ఉన్నాయని అర్థం చేసుకున్నారు.

ఏపీ ప్రభుత్వం బైజూస్ పేరుతో బడా స్కామ్ చేస్తోందన్న ఆరోపణలు అయితే ఉన్నాయి. అది స్కీమో స్కామో కానీ వాటి కోసం 730 కోట్ల రూపాయలు పెట్టి ట్యాబ్‌లు కొంటోంది. గత ఏడాదే అది పెద్ద స్కామ్ అని ఆరోపణలు వచ్చాయి. ఈ ఏడాది కూడా అదే రిపీట్ చేస్తున్నారు. కానీ కాంట్రాక్టర్లకు డబ్బులు ఇస్తారో లేదో డౌట్ వచ్చింది. అసలే ఎన్నికలు వస్తున్నాయి. అందుకే కాంట్రాక్టర్లు టెండర్లు వేయాలంటే సమయానికి డబ్బులు ఇవ్వకపోతే… వడ్డీతో సహా చెల్లిస్తామని ఆఫర్ పెట్టాలని డిమాండ్ చేశారు. దానికి ప్రభుత్వం ఓకే అని చెప్పింది. అయితే ఈ టెండర్లన్నీ ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే నడుస్తాయి. అయినా ఈ వడ్డీక్లాజ్ ఎందుకు పెట్టారన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.

ఇక ముందు ప్రభుత్వం విచ్చలవిడిగా టెండర్లు పిలుస్తుందని సకాలంలో చెల్లించకపోతే వడ్డీ కూడా ఇస్తామని రాసిస్తుందని చెబుతున్నారు. అంటే ఇప్పుడు చెల్లించనక్కర్లేదన్నమాట. తర్వాత ప్రభుత్వం మారితే భారం మొత్తం ఆ ప్రభుత్వానిదే. ప్రభుత్వమే ఒప్పందం చేసుకుంది కాబట్టి కాంట్రాక్టర్లు కోర్టుకైనా వెళ్లి వసూలు చేసుకుంటారు. అదీ జగన్ రెడ్డి మాస్టర్ ప్లానని అధికారులు చెవులు కొరుక్కుంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -