Supreme Court: ఏపీకి రాజధాని విషయంలో ఇబ్బందే.. సుప్రీం కీలక నిర్ణయమిదే!

Supreme Court: హైదరాబాద్ నుంచి ఆంధ్ర ప్రదేశ్ విడిపోయిన తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు అమరావతిని రాజధానిగా ప్రకటిస్తూ తాత్కాలిక సచివాలయాన్ని నిర్మించారు. అయితే జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలన ఓకే ప్రాంతం నుంచి జరిగితే అభివృద్ధి జరగదని భావించినటువంటి జగన్ మూడు రాజధానులు అంశాన్ని తెరపైకి తీసుకోవచ్చారు.

ఇలా ఆంధ్రప్రదేశ్ కి మూడు రాజధానులను ఏర్పాటు చేసి అన్ని ప్రాంతాలలోనూ అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతోనే మూడు రాజధానుల విషయాన్ని తెరపైకి తీసుకువచ్చారు అయితే ఈ విషయాన్ని చాలామంది విమర్శిస్తూ కోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో విచార‌ణ జ‌రుగుతుండ‌గా, సాంకేతిక కార‌ణాల‌ను చూపి మూడు రాజ‌ధానుల బిల్లును వెన‌క్కి తీసుకున్నామ‌ని, త‌ర్వాత విచారించాల‌ని ప్ర‌భుత్వం అభ్య‌ర్థించింది.

 

ఈ విధంగా ఏపీ ప్రభుత్వం అభ్యర్థన పై హైకోర్టు తిరస్కరణ చూపింది. ఇది ప్ర‌భుత్వ నిర్ణ‌యానికి వ్య‌తిరేకంగా వుంది. అంతేకాదు, ఆరు నెల‌ల్లోనే రాజ‌ధానిని నిర్మించాల‌ని కూడా ఆదేశించింది. ఈ తీర్పును స‌వాల్ చేస్తూ ఏపీ ప్ర‌భుత్వం సర్వోన్న‌త న్యాయ‌స్ధానాన్ని ఆశ్రయించారు. అయితే మరోవైపు పరిపాలనను విశాఖకు తరలించాలని వైసీపీ ప్రభుత్వం చాలా ఉత్సాహత కనబరుస్తుంది. కేసుపై జ‌స్టిస్ సంజీవ్‌ఖ‌న్నా, జ‌స్టిస్ బేలా త్రివేదిల‌తో కూడిన ధ‌ర్మాస‌నం విచార‌ణ చేప‌ట్టింది. సుప్రీంకోర్టు స్పంద‌న‌పై ఏపీ స‌మాజం ఆస‌క్తి చూస్తోంది.

 

ఈ కేసు విచార‌ణ‌ను డిసెంబ‌ర్‌కు వాయిదా వేయ‌డంతో ఏపీ ప్రభుత్వం తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తుంది. నవంబర్ వరకు రాజ్యాంగ ధ‌ర్మాస‌నం కేసులుండడంతో అంత వ‌ర‌కూ అమ‌రావ‌తిపై వెంట‌నే విచార‌ణ చేయ‌డం కుద‌రద‌ని స్ప‌ష్టం చేసింది. ఈ లోపు ప్ర‌తివాదులంద‌రికీ నోటీసులు పంపే ప్ర‌క్రియ‌ను పూర్తి చేయాల్సిందిగా కోర్ట్ తీర్పు వెల్లడించింది అయితే ఈ కేసు విచారణ కోసం డిసెంబర్ వరకు వేచి చూడాల్సిందేనని స్పష్టమవుతుంది.

 

 

Related Articles

ట్రేండింగ్

Varun Tej: ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం.. వరుణ్ తేజ్ కామెంట్లతో ఫ్యాన్స్ ను ఫిదా చేశారా?

Varun Tej: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి ప్రజలే కుటుంబ సభ్యులని, అప్పులు చేసి మరీ కౌలు రైతులకు సాయం చేస్తున్నారని సినీ నటుడు వరుణ్ తేజ్ అన్నారు. పవన్ కళ్యాణ్...
- Advertisement -
- Advertisement -