జీఎస్టీ వసూళ్ళలో ఆంధ్రప్రదేశ్ టాప్.. జగనన్న అభివృద్ధికి ఇంతకంటే సాక్ష్యం కావాలా?

ప్రస్తుతం ఏపీలో జీఎస్టీ వసూళ్లు ఎలా ఉన్నాయో మనందరికీ తెలిసిందే. జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రతి ఒక్క దానిపై జీఎస్టీ బాదుడు ఎక్కువ అయిపోయింది అని తలలు పట్టుకుంటున్న వారు చాలామంది ఉన్నారు. కానీ వైసీపీ నేతలు అలాగే కేంద్రం కూడా జగన్ ప్రభుత్వం జీఎస్టీ వసూళ్లలో ఆ టాప్ లో ఉంది. అభివృద్ధిని సాధించిందని చెబుతున్నాయి. తాజాగా ఇదే విషయాన్ని వెల్లడించింది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రంలో అమలవుతున్న వ్యాపార వాణిజ్య, పారిశ్రామిక విధానాలు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయన్నది ఇప్పుడిప్పుడే తెలిసొస్తోంది. సులభతరం వాణిజ్య విధానాలు అమలు చేయడంలో, దేశీయ విదేశీ పెట్టుబడులు ఆకర్షించడంలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సారధ్యంలోని ఆంధ్రప్రదేశ్ గొప్ప ప్రగతి సాధించినట్లు తాజాగా కేంద్రం విడుదల చేసిన నివేదికల్లో ఇప్పటికే వెల్లడైన విషయం తెలిసిందే.

కాగా గత నెల అనగా అక్టోబర్ 2023 వరకు జీఎస్టీ వసూళ్ల వృద్ధి రేటులో దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక, ఏపీ అగ్రస్థానంలో నిలిచాయి. రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ జీఎస్టీ ఆదాయం 12 శాతం వృద్ధి రేటుతో రూ. 18,488 కోట్లుగా ఉంది. అలాగే దక్షిణాది రాష్ట్రాలు అయిన కర్ణాటక కూడా 12 శాతం వృద్ధి రేటుతో ఆంధ్రప్రదేశ్ తో సమానంగా ఉంది. ఇకపోతే మిగతా రాష్ట్రాలైన తెలంగాణ 10 శాతం, తమిళనాడు 9 శాతం, కేరళ 5 శాతం వృద్ధి రేటును నమోదు చేశాయి. కాగా దేశవ్యాప్తంగా అక్టోబర్‌లో స్థూల జీఎస్‌టీ ఆదాయం రూ.1,72,003 కోట్లుగా ఉంది.

మొత్తంలో రూ.30,062 కోట్లు సెంట్రల్ జీఎస్టీ, రూ.38,171 కోట్లు స్టేట్ జీఎస్టీ, రూ.91,315 కోట్లు, ఐజీఎస్టీ, రూ.12,456 కోట్లు వస్తువుల దిగుమతిపై వసూలు నమోదు అయ్యాయి. అలా మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పన్నుల ఆదాయంలో దూసుకుపోతోంది దీనికి సీఎం వైయస్ జగన్ సారధ్యంలోని ప్రభుత్వం చేపట్టిన పాలనా సంస్కరణలు, పారదర్శక విధానాలే కారణమని అంటున్నారు. మొత్తంగా ఏపీ ప్రభుత్వం జీఎస్టీ వసూళ్లలో టాప్ లో నిలిచింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -