Illegal Sand Mining: ఏపీలో వెలుగులోకి ఇసుక స్కాం.. అధికారులతో పాటు జగన్ కు కూడా ఇబ్బందులు తప్పవా?

Illegal Sand Mining: వైసీపీ ఆకృత్యాలకు, ఆగడాలకు, దోపిడీలకు సహకరించిన అధికారులు ఎన్నికలు దగ్గరపడేకొద్ది ఇరుక్కుంటున్నారు. పలు వివాదాల్లో వైసీపీ ప్రభుత్వాన్ని హైకోర్టు తప్పుపట్టింది. వందకు పైగా ప్రభుత్వ నిర్ణయాలను తూర్పారబట్టింది. కోర్టుకు హాజరుకావలని సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రభుత్వం చేసిన పాపానికి అధికారులు న్యాయస్థానం ఎదుట చేతులకట్టుకొని నిలబడాల్సి వచ్చింది. సాక్షాత్తు రాష్ట్ర డీజీపీ కూడా పలుసార్లు కోర్టు విచారణలకు హాజరైయ్యారు. వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలను ఎదురించలేకో.. లేకపోతే పార్టీ మీద అభిమానంతో సమర్థిస్తూ వచ్చిన అధికారులకు పట్టిన గతి అది.

న్యాయస్థానాల్లో అధికారుల విషయాన్ని పక్కన పెడితే.. తిరుపతి ఉపఎన్నికల్లో దొంగఓట్ల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారుతోంది. దొంగఓట్లు సహకరించిన వారిపై వరుసగా వేటు పడుతుంది. భవిష్యత్ లో ఇంకా చాలా మంది వేటు పడుతుందని ప్రచారం నడుస్తోంది.

ఇప్పడు మరో వ్యవహారం అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తోంది. ఏపీలో ఇసుక దోపిడీపై ఓ వైపు టీడీపీ, మరోవైపు జనసేన విమర్శలు చేస్తూ వస్తున్నారు. కానీ, అధికార పార్టీ నాయకులు అవేవీ పట్టించుకోలేదు. అధికారం ఉందికదా? ఏం చేసినా సాగిపోతుందని అనుకున్నారు. కానీ, ఏపీలో ఇసుక తవ్వకాలపై సంచలన అంశాలను కేంద్రం నియమించిన కమిటీ వెలుగులోకి తీసుకొని వచ్చింది. అడ్డుగోలుగా తవ్వేసి సహజవనరులను దోచేశారని కేంద్రకమిటీ తేల్చింది. దీనిపై నివేదికను ఎన్జీటీకి, ఏపీ హైకోర్టుకు సమర్పిస్తామని తెలిపింది. ఇందులో వైసీపీలో బడానేతలతో పాటు అధికారులు కూడా ఇరుక్కునే ప్రమాదం ఉంది.

ఏపీలో ఇసుక పాలసీ గురించి పూర్తి వివరాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అయితే, ప్రభుత్వం తరఫున న్యాయవాది వైసీపీ రేంజ్ వాదనలు వినిపించారు. అసలు రాష్ట్రంలో ఎక్కడా తవ్వకాలు జరగడం లేదని.. కేవలం స్టాక్ పాయింట్ల నుంచి మాతమ్రే ఇసుక తరలింపు జరుగుతుందని అన్నారు. లాయర్ సమాధానంపై ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయమూర్తి.. స్టాక్ పాయింట్లలో ఎంత ఇసుక ఉందో చెప్పాలని ప్రశ్నించారు. దీనికి న్యాయవాది దగ్గర సరైన సమాధానం లేదు. దీంతో. మరోసారి ప్రభుత్వం తీరుపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రభుత్వం ఎంత కవర్ చేసినా ఏపీలో ఇసుకదోపిడీ జరుగుతున్నది అన్నది అక్షర సత్యం. పర్యావరణ అనుమతులను కూడా పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. యంత్రాలతో ఇసుకను తవ్వడం నిబంధనలకు వ్యతిరేకం. కానీ, నదీగర్భంలో యంత్రాలు పెట్టి తవ్వేస్తున్నారు. నది మధ్యలో రోడ్డు నిర్మించి మరీ తవ్వేస్తున్నారంటే.. వైసీపీ నేతల దాహం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంత జరుగుతున్నా జిల్లా కలెక్టర్లు చూసి చూడనట్టు వదిలేశారు. కొన్నిసార్లు ప్రభుత్వ చర్యలను వెనకేసుకొని వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ, అలాంటివారు ఇప్పుడు అడ్డంగా ఇరుక్కున్న పరిస్థితి వచ్చింది. కేంద్ర కమిటీ తన నివేదికను హైకోర్టుకు, ఎన్జీటీకి అందిస్తే.. ఇసుకదోపిడీలో పాత్రదారులు, సూత్రదారులు, సహకరించిన వారు అంతా లోపలకు పోవడం ఖాయంగా కనిపిస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -