High Court: ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు.. జగన్ సర్కార్ నిర్వాకంతో నిరుద్యోగులకు షాక్

High Court: ఏపీ ప్రభుత్వానికి న్యాయస్థానాల్లో చీవాట్లు పడటం ఇష్టమో.. లేదంటే కోర్టులను దోషులుగా చూపించి ప్రజలకు ఇచ్చిన హామీలను ఎగ్గొట్టాలి అనుకుంటుందో తెలియదు కానీ.. ఒక్క పని కూడా తిన్నగా చేయదు. మెగా డీఎస్సీ.. నిరుద్యోగులకు ఉపాధి కల్పన అంటూ.. గత ఎన్నికల ముందు ఏపీ సీఎం జగన్ ఊరూరా తిరిగారు. ఆశపడిన నిరుద్యోగులు ఓట్లను వరుస పెట్టి వైసీపీ అభ్యర్థులకు గుద్దారు.. జగన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కానీ మెగా డీఎస్సీ కాదు కదా.. మినీ డిఎస్సీ కూడా లేదు. అయితే ఎన్నికలు దగ్గర పడుతున్నాయని ఈ నెల 12న 6100 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. కావాలని చేస్తారో.. తెలియక చేస్తారో కానీ.. తప్పులు లేకుండా జోవోలు, ఉత్తర్వులు, నోటిఫికేషన్లు ప్రభుత్వం నుంచి వెలువడవు. ఈ 6100 పోస్టుల్లో 2280 ఎస్జీటీ పోస్టులు కూడా ఉన్నాయి.

ఈ పోస్టులకు బీఈడీ డిగ్రీ చేసిన వారిని కూడా అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిని సవాల్ చేస్తూ పలువురు అభ్యర్థులు కోర్టుకు వెళ్లారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ప్రభుత్వానికి చీవాట్లు వేసింది. ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను అనుమించడాన్ని అంగీకరించేదే లేదని తేల్చి చెప్పింది. ఇది సుప్రీం కోర్టు నిర్ణయానికి వ్యతిరేకమని మండిపడింది. విద్యార్థులు జీవితాలతో ఆడుకుంటామంటే ఊరుకునేదే లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు..నోటిఫికేషన్‌పై స్టే విధించింది. పిటిషనర్ల తరుఫున జడ శ్రావణ్ కుమార్ తన వాదనలు వినిపించారు. ఎస్జీటీ పోస్టులకు అనుమతించడం విద్యాహక్కు చట్టం, సుప్రీంకోర్టు తీర్పు, ఎస్‌సీటీఈ ఉత్తర్వులకు విరుద్దమని కోర్టు ముందు తెలిపారు. ఎస్జీటీలు ఒకటి నుంచి ఐదో తరగతికి బోదిస్తారని చెప్పారు. అంతేకాదు.. డీఈడీ అర్హత కలిగిన ఉపాధ్యాయులు ఒకటి నుంచి ఐదో తరగతి వరకు బోదించడం సబబని సుప్రీం కోర్టు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. కానీ, అందుకు భిన్నంగా రాష్ట్రం ప్రభుత్వం ఎస్జీటీ పోస్టుల భర్తీకి బీఈడీ అభ్యర్థులను ఆహ్వానిస్తుందని చెప్పారు. ఈ ప్రక్రియను నిలువరించాలని కోర్టుకు కోరారు.

అయితే, మూడు నుంచి 8వ తరగతి వరకు ప్రాథమిక విధ్య పరిధిలోకి తీసుకొచ్చామని అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ కోర్టుకు తెలిపారు. అందుకే.. బీఈడీ, డీఈడీ అభ్యర్థులిద్దరూ అవసరం ఉంటుందని చెప్పారు. టీచర్లుగా ఎంపికైన వారికి అప్రంటీస్ కింద రెండేళ్లు శిక్షణ ఉంటుందని చెప్పారు. దీంతో.. ఎస్జీటీలు ఉన్నత పాఠశాల విధ్యార్థులకు, బీఈడీలు ప్రాథమిక పాఠశాల విధ్యార్థులకు బోధించడం సాధ్యమవుతుందని తెలిపారు. దీంతో పాటు ఎంపికైన టీచర్లు ఎన్‌సీటీఈ నిర్వహించే ఆరు నెలల బ్రిడ్జ్ కోర్సులో అర్హత సాధించాల్సి ఉంటుందని చెప్పారు. దీనిపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ వైపు ట్రైనింగ్ తీసుకుంటూ మరోవైపు పిల్లలకు క్లాసులు చెప్పడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించింది. ఏరకంగానూ ఈ అంశాన్ని అంగీకరించలేమని తేల్చి చెప్పింది. నోటిఫికేషన్ పై స్టే విధించింది. నోటిఫికేషన్ లో ఎలాంటి పొరపాట్లు లేకపోతే.. ఈ నెల 22న హాల్ టికెట్లు రావాల్సి ఉంది. కానీ.. ప్రభుత్వం చేసిన నిర్వాకంతో నిరుద్యోగుల ఆశలు అడియాశలు అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -