Eenadu: ఏపీపై విషం కక్కుతున్న ఈనాడు.. జగన్ పాలన ఇంతేనంటూ?

Eenadu: ప్రస్తుత రోజుల్లో రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు ఉన్నత చదువులు చదివినా కూడా ఉద్యోగం కావాలంటే పక్క రాష్ట్రాలకు వెళ్లాల్సిందే. ఇక్కడే ఉండాలి ఏదో ఒక పని చూసుకోవాలి అంటే చివరికి కూలి పనులు లాంటివే దక్కుతున్నాయి. మంచి మంచి చదువులు చదివి చివరికి కూలి పనులు చేయాల్సి వస్తోంది. లేదంటే నిరుద్యోగులుగానే మిగిలిపోవాలి. ఏపీలో పెద్ద నగరమంటూ లేదు. ఐటీ కంపెనీలు రావు. ప్రభుత్వం ప్రోత్సాహం అందించదు. పరిశ్రమలను తీసుకొచ్చి, ఉపాధి కల్పించే దిశగా చర్యలు తీసుకోదు. ఇతర రాష్ట్రాలకు ఉద్యోగులను అందించే రాష్ట్రంలా ఏపీ మారిపోయింది. విద్యాసంస్థల నుంచి బయటకు వస్తున్న యువత ఉద్యోగాల కోసం బస్సులు, రైళ్లు, విమానాలు ఎక్కేస్తున్నారు.

కనీసం పీజీ చేయాలన్నా కూడా ఇతర రాష్ట్రాలు, దేశాలకు తరలిపోతున్నారు. ఎంటెక్‌లో 21 వేలకు పైగా సీట్లు ఉంటే, చేరుతున్నవారు 5వేలలోపే సాధారణ పీజీ కోర్సుల్లో 37 శాతం మందే ప్రవేశాలు పొందడం ఆందోళనకర విషయమే. రాష్ట్రంలో నిరుద్యోగుల్లో 73శాతానికి పైగా పట్టభద్రులే ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న కంపెనీలు తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోతుంటే కొత్తవి ఎలా వస్తాయన్న ఆలోచనా ఏపీ ప్రభుత్వం చేయడం లేదు. అసలు నిరుద్యోగుల గురించి పట్టించుకోవడం లేదు ఏవి ప్రభుత్వం. ఒకవేళ ఇదే పరిస్థితి కనుక కొనసాగితే భవిష్యత్తులో సంపాదన లేనివారు, తక్కువ ఆదాయం సంపాదించేవారు, వృద్ధులే ఏపీ రాష్ట్రంలో మిగులుతారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.

 

రాష్ట్రంలో ఉద్యోగం, ఉపాధి అంటే పొరుగుసేవల ఉద్యోగం లేదంటే కూలి పనులు, కార్మికులు, నైట్‌ వాచ్‌మన్ల పనులే ఉంటున్నాయి. సీఎంఈ నివేదిక సైతం దీనినే ధ్రువీకరించింది. గత రెండేళ్ల సగటు చూస్తే రాష్ట్రంలో లక్షమంది వరకు బీటెక్‌లో ప్రవేశాలు పొందుతున్నారు. డిగ్రీలోనూ సగటున 1.50 లక్షల మంది చేరుతున్నారు. వీరిలో 65-70% ఉత్తీర్ణులవుతారు. ఈ లెక్కన 1.75 లక్షల మంది విద్యాసంస్థల నుంచి బయటకు వస్తున్నారు. వీరిలో 35% మందికి ఉద్యోగాలు లభించడం లేదు. మిగతా 1.13 లక్షల మందిలోనూ ఉపాధి కోసం బయట రాష్ట్రాలకు వెళ్లిపోతున్నవారే 95% మంది ఉన్నారు. మూడు రాజధానుల ప్రకటనతో నిర్మాణ రంగం కుదేలైంది. దీంతో సివిల్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థులకు ఉద్యోగాలు లేవు. స్థిరాస్తి వ్యాపారం దెబ్బతినడంతో పలు కంపెనీలు ఉద్యోగులను తొలగించాయి.

 

పెద్ద వ్యాపారులు హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు వెళ్లిపోయారు. పరిశ్రమలు రాకపోవడంతో మెకానికల్‌ ఇంజినీర్లకు ఉద్యోగాలు లేవు. ఏ రాష్ట్రంలో అయినా వివిధరంగాల్లో 10 నుండి 15 విశిష్ట విద్యాసంస్థలు ఉంటాయి. మన రాష్ట్రంలో నిట్‌, ఐఐటీ మినహా ఆ స్థాయి విద్యాసంస్థ ఒక్కటీ లేదు. విభజన చట్టం ప్రకారం కేంద్రం కొన్ని విద్యాసంస్థల్ని ఏర్పాటుచేసినా నిధులు, వనరులు సమకూర్చకపోవడంతో అవి ఇప్పటికీ ఆ స్థాయికి చేరలేదు. వాటిలో చదువుకున్నవారికి ఉద్యోగాలు కల్పించేలా రాష్ట్రానికి పరిశ్రమలు రావడం లేదు. దీంతో ఏపీలో నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు ఇకపై ఉద్యోగాలు రావు అన్న మాట ఎక్కువగా వినిపిస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో గుప్త నిధుల కొరకు తవ్వకాలు.. ఈ ఆరోపణలపై వైసీపీ స్పందిస్తుందా?

Tirumala: తిరుమల తిరుపతి దేవస్థానంలో పింక్ డైమండ్ దొంగలించారు. ఐదేళ్ల క్రితం వచ్చిన ఈ ఆరోపణలను ఎవరూ మర్చిపోలేరు. ఎందుకంటే టీటీడీ అప్పటి ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు గత ప్రభుత్వంపై చేసిన...
- Advertisement -
- Advertisement -