Health Tips: షుగర్, బీపీ, క్యాన్సర్ కు సులువుగా చెక్ పెట్టే డైట్ ఇదే!

Health Tips: ఆరోగ్యమే మహాభాగ్యమన్నారు పెద్దలు. కానీ ఇప్పుడు 30 ఏళ్లకే అనారోగ్య సమస్యలతో అంతా సతమతం అవుతున్నారు. దీంతో లైఫ్ ని సక్రమంగా రన్ చేయలేకపోతున్నారు. వారి తినాలకున్నది తినలేకపోతున్నారు. షుగరొచ్చిందని, బీపీ వచ్చిందని చాలా రుచులకి దూరమౌతుంటారు. రోజూ వాకింగ్ చేస్తున్నా ఎందుకొచ్చిందో కానీ షుగరొచ్చిందని చాలా మంది బాధపడుతుంటారు. కానీ ఈ డైట్ ఆహారం వల్ల మీ బీపీ, షుగర్ కు చెక్ పెట్టవచ్చు.

ప్రస్తుతం అంతా డైట్ ప్లాన్ కాలం నడుస్తోంది. ఈ డైట్ చెప్పేవాళ్ల యూట్యూబ్ ఛానళ్లకు బాగా డిమాండ్ ఉంది. ప్రస్తుతం వీరమాచనేని ప్రచారం చేసేవి.ఆర్.కె డైట్ మంచిదంటారు. కొందరు ఖాదర్ వలి చెప్పే చిరుధాన్యాల ఆహారం సరైనదంటారు. ఇంకొందరు మంతెన సత్యనారాయణరాజు ప్రచారం చేసే ఉప్పులేని సహజ ఆహారం మంచిదంటారు. ఇలా ఎవరు ఏది చెప్పినా అది మంచిదే. అయితే ఎవరికి ఏది పడుతుందో, ఏది రుచిస్తుందో చెప్పడం కష్టం. అది ఆయా వ్యక్తుల అభిరుచుల్ని బట్టి, ఇతర ఆరోగ్యపరిస్థులను బట్టి అహారపు అలవాట్లను బట్టి శరీర తత్వాన్ని బట్టి ఉంటుంది.

 

అయితే ఇప్పుడు తాజాగా పశ్చిమ దేశాల్లో ప్రచారం పొందుతున్నది “హార్వర్డ్ డైట్”. ఈ డైట్లో సగం శాతం పళ్లు, కాయగూరలు ఉండి మిగిలిన సగం గింజలు, ఆరోగ్యకరమైన ప్రొటీన్స్ తో కూడి ఉంటుంది. అయితే కూరగాయల్లో ఆలుగడ్డ పూర్తిగా నిషిద్ధం. ఎందుకంటే అది పేరుకి కూరగాయే అయినా దానిని రక్తంలో చక్కెర శాతాన్ని గణనీయంగా పెంచే రిఫైండ్ కార్బోహైడ్రేట్ గా గుర్తించి పక్కనపెట్టేయాలంటున్నారు.

 

అలాగే ఈ డైట్లో తప్పనిసరిగా తినదగ్గ గ్రెయిన్స్ ఏంటంటే ఓట్స్, కినొవా, బార్లీ, గోధుమ, బ్రౌన్ రైస్. వీటిల్లో ఏదో ఒకటి ప్లేటులో పావుభాగం మాత్రమే ఉండాలంటున్నారు. మరో పావు భాగాన్ని ఆరోగ్యకరమైన ప్రొటీన్- అంటే బీన్స్, నట్స్, చేప, చికెన్ వంటివి. ఇక్కడ రెడ్ మీట్ పూర్తిగా నిషిద్ధం. అలాగే పాలు తాగే బదులు, బ్లాక్ టీ, గ్రీన్ టీ, బ్లాక్ కాఫీకి అలవాటు పడడం మంచిదని ఈ డైట్ చెబుతుంది.

 

ఈ ఆహార నియమాలు పాటిస్తే వర్కౌట్స్ కూడా మరీ అతిగా చెయ్యాల్సిన అవసరం ఉండదు. శరీరంలో కరిగించాల్సిన కేలరీలు ఎక్కువగా ఉండకపోవడం వల్ల తక్కువపాటి వ్యాయామాలైన వాకింగ్, జాగింగ్ వంటి వాటితో శరీరాన్ని చాలా ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -