Suma-Rajiv Kanakala: సుమ రాజీవ్ కనకాల మధ్య సమస్యలు ఉన్నాయా.. అందుకే దూరమా?

Suma-Rajiv Kanakala: తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ సుమ కనకాల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో నెంబర్ వన్ యాంకర్ ఎవరు అంటే కచ్చితంగా సుమ పేరే వినిపిస్తూ ఉంటుంది. తెలుగు బుల్లితెరపై మకుటం లేని మహారాణిగా దూసుకుపోతోంది సుమ. ఆడియో రిలీజ్ ఫంక్షన్లు, ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లు, ప్రోగ్రాములు, పండుగ ఈవెంట్లు ఇలా ఎక్కడ చూసినా కూడా సుమా పేరే వినిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా స్టార్ హీరోలు డైరెక్టర్లు సైతం సుమ కనకాల కాల్ షీట్స్ కోసం ఎదురు చూస్తుంటారు అనడంలో ఎటువంటి సందేహం లేదు.

అందుకు గల కారణం సుమ తన యాంకరింగ్ తో చిన్న పెద్ద అని తీయడం లేకుండా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉంటుంది. కేవలం యాంకర్ గా మాత్రమే కాకుండా పలు సినిమాలలో సీరియల్స్ లో నటిగా కూడా నటించి మెప్పించింది. ఈమె టాలీవుడ్ నటుడు రాజీవ్ కనకాల ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మధ్యకాలంలో సుమ హవా కాస్త తగ్గిందనే చెప్పవచ్చు. ఏవో ఒకటి రెండు షోలలో మాత్రమే కనిపిస్తోంది. ఇది ఇలా ఉంటే ఆ మధ్య ఒకసారి సుమ కనకాల రాజీవ్ కనకాల మధ్య గొడవలు వచ్చాయని వారిద్దరు విడిపోబోతున్నారు అంటూ వార్తలు వినిపించడంతో సుమ తన భర్తతో కలిసి ఉన్న ఫోటోని షేర్ చేస్తూ ఆ వార్తలకు చెక్ పెట్టేసింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్న విషయం తెలిసిందే.

 

అయితే గతంలో వీరిద్దరూ విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకోగా పిల్లల కోసం మళ్లీ ఒకటయ్యారని తెలిసింది. ప్రస్తుతానికి ఇద్దరు బాగానే ఉంటున్నట్లు తెలుస్తుంది. షో లలో కూడా ఇద్దరు బాగానే ఫ్రీగా కనిపిస్తూ ఉంటున్నారు. అయితే ఇంట్లో ఈ జంట కొన్ని కండిషన్స్ తో ఉంటారంట. ఇంట్లో పిల్లల ముందు ఫోన్ అసలు ఆన్ చేయరట. కేవలం యూట్యూబ్ వీడియోస్ వరకే సుమ ఫోన్ వాడుతుందని, రాజీవ్ కనకాల కూడా ఫోన్ కి దూరంగా ఉంటాడని తెలిసింది. అయితే సుమనే ఇంట్లో కొన్ని రూల్స్ పెట్టిందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక వీళ్ళ బయట ఫుడ్ అసలు తినరట. కేవలం ఇంట్లో వండిన ఫుడ్ ని మాత్రమే తినాలని సుమ స్ట్రిక్ట్ గానే రూల్స్ పెట్టిందట.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -