Rajiv: ఎన్టీఆర్ బిహేవియర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన రాజీవ్.. ఏమైందంటే?

Rajiv: టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్, నటుడు రాజీవ్ కనకాల మధ్య ఉన్న స్నేహబంధం గురించి మనందరికీ తెలిసిందే. కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే మొదట వీరిద్దరి మధ్య పరిచయం గొడవలతో మొదలైందట. ఆ గొడవలు కాస్త ఫ్రెండ్షిప్ గా మారిందట. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజీవ్ కనకాల ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ.. నిన్ను చూడాలని ఉంది సినిమాకి జూనియర్ ఎన్టీఆర్‌ నన్ను డబ్బింగ్ చెప్పమన్నారు. ఎన్టీఆర్‌కి నా వాయిస్ సెట్ కాదని నేను వెనక్కి వచ్చేస్తే, ఎన్టీఆర్ తన క్యారెక్టర్ కు డబ్బింగ్ తానే చెప్పుకున్నాడ‌ని గుర్తు చేసుకున్నాడు.

మేమిద్దరం మొదటిసారిగా స్టూడెంట్ నెంబర్ 1 సెట్ లో కలిసాము. కలిసిన మొదటి రోజు మధ్యాహ్నానికే ఎన్టీఆర్ నామీద కామెంట్స్ చేశాడు. నాకు మంచి స్నేహితుడు చంద్రశేఖర్ నుంచి అత‌డి కళ్ళజోడు బాగుందని నా పాత్రకు బాగా సెట్ అవుతుందని అతడి దగ్గర నుంచి తీసుకుని పెట్టుకున్నాను షూటింగ్ జరుగుతుండగా ఇది అవసరమా? అని నాపై ఎన్టీఆర్ కామెంట్స్ చేశాడని రాజీవ్ చెప్పుకొచ్చారు. నాకు కోపం వచ్చి రాజమౌళి దగ్గరికి వెళ్లి చెప్పానని ఇప్పుడు కామెంట్ చేశాడు. రేపు పొద్దున్నే నన్ను ఇంకోటి ఏదో అంటాడు నేను కౌంటర్ వేస్తాను. తిరిగి అందరూ నన్నే అంటారు. నేను సినిమాలో నుంచి వెళ్ళిపోతాను అన్నాను. దాంతో రాజ‌మౌళి ఆయన ఏదో సరదాగా జోక్ చేశాడు.

 

మరి ఇంత సెన్సిటివ్ గా ఆలోచిస్తున్నావేంటి అన్న‌ట్టు రాజీవ్ అన్నారని చెప్పుకొచ్చారు రాజీవ్ కనకాల. ఆ తర్వాత రోజు సెట్స్‌లోకి వెళ్తే ఎన్టీఆర్ రాజుగారు నమస్కారం రండి సార్ అంటూ అప‌రిచితుడులా బిహేవ్ చేసాడని మూడో రోజు మళ్ళీ ఏదో? జోక్ చేశాడు. ఇక తర్వాత నుంచి ఫ్రెండ్లీగా ఉండడం మొదలు పెట్టాన‌ని తర్వాత బాగా క్లోజ్ అయిపోవడం.. సెకండ్స్ షెడ్యూల్ కు వచ్చేసరికి రాజీవ్ గారు అనే ఎన్టీఆర్ ఒరేయ్ రాజుగా అని పిలిచేవ‌డంతో నేను షాక్ అయ్యాను అంటూ వివరించాడు. మరి ఫ్రెండ్ అంటే అనరా అని ఎన్టీఆర్ అన్నాడు. అప్పటినుంచి మేమిద్దరం బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాం అని తెలిపారు రాజీవ్ కనకాల. అలా వారిద్దరి మధ్య మొదట గొడవలతో ఏర్పడిన పరిచయం కాస్త స్నేహంగా మారింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -