KCR BRS: కేసీఆర్ కు మరో భారీ షాక్.. తెలంగాణలో బీ.ఆర్.ఎస్. పార్టీ చరిత్ర ముగిసినట్టేనా?

KCR BRS: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పరిస్ధితి రోజురోజుకీ దయానీయంగా మారిపోతుంది. ఎవరు పార్టీలో ఉంటారో ఎవరు వెళ్లిపోతారో తెలియడం లేదు. ఎంపీ ఎన్నికల్లో టికెట్ ఆశించిన భంగపడిన వాళ్లు ఎలాగూ పార్టీని వీడుతున్నారు. అటు, టికెట్ దక్కినవాళ్లు కూడా ఎంతవరకూ పార్టీలో కొనసాగుతారో తెలియని పరిస్థితి ఏర్పడింది. తెలంగాణకు చెందిన మరో ప్రముఖ బీఆర్ఎస్ నాయకుడు కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎంపీ టికెట్ ఇస్తానని ఇవ్వకపోవడంతో మెదక్ జిల్లాకు చెందిన నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి పార్టీ మారేందుకు నిర్ణయించుకుని ఢిల్లీ బయలుదేరి వెళ్తున్నట్టు సమాచారం అందింది.

మదన్ రెడ్డి పార్టీ మారుతున్న విషయాన్ని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ఇప్పుడేం చెప్పలేనని సమాధానం ఇచ్చారు. మదన్ రెడ్డి 2014, 2019 ఎన్నికల్లో నర్సాపూర్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2023 ఎన్నికల్లో ఆయనకు టికెట్ నిరాకరించిన బీఆర్ఎస్ అధిష్టానం ఆ సీటు సునీతా లక్ష్మారెడ్డికి కేటాయించింది. పార్లమెంటు సీటు ఇస్తామని హోల్డ్‌లో పెట్టిన పార్టీ ఇంతవరకు ఆయనకు టికెట్ ఖరారు చేయకపోవడంతో పార్టీ వైఖరిపట్ల ఆయన మౌనం వహించారు. ఈ నేపథ్యంలో మదన్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరనున్నారని ప్రచారం జరుగుతోంది. అటు, ఖమ్మం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వర్ రావు కూడా బీజేపీలోకి చేరుందుకు రంగం సిద్దం చేసుకున్నారని తెలుస్తోంది. ఢిల్లీలో మకాం వేసి ఆయన బీజేపీ పెద్దలతో చర్చలు జరుపుతున్నారని బీఆర్ఎస్ వర్గాలే చెబుతున్నాయి. అన్ని కుదిరితే రెండు రోజుల్లో నామా బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తారని తెలుస్తోంది.

బీఆర్ఎస్ ను సమస్యలు చుట్టు ముడుతున్నాయి. ఓవైపు కేసులు, మరోవైపు వలసలతో బీఆర్ఎస్ అధిష్టానం ఉక్కిరిబిక్కిరి అవుతుంది. ఒంటి చేత్తో ఎన్నో ఎన్నికలను ఎదుర్కొని వచ్చిన కేసీఆర్ చిన్న ఎమ్మెల్సీ ఎన్నికను ఎలా ఎదుర్కోవాలో తెలియక సతమతం అవుతోంది. పాలమూరు సిట్టింగ్‌ ఎమ్మెల్సీ స్థానాన్ని తిరిగి నిలబెట్టుకోవాలని బీఆర్‌ఎస్‌ తీవ్రంగా శ్రమిస్తోంది. ఇప్పటికే బీఆర్‌ఎస్‌ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లను గోవా క్యాంప్ కు తరలించారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా గోవా వెళ్లి వారికి బుజ్జగించి రావడం హాట్ టాపిక్ అయింది. సిట్టింగ్‌ ఎమ్మెల్సీ స్థానాన్ని నిలబెట్టుకోవాలని, ఎవరికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా పార్టీ చూసుకుంటుందని హామీ ఇచ్చినట్టు చెప్పారంటున్నారు. మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పరిధిలో మొత్తం 1,439 ఓట్లు ఉన్నాయి. గెలుపు ఖాయమని బీఆర్ఎస్, కాంగ్రెస్ ధీమాగా ఉన్నాయి. ఈనెల 28న పోలింగ్‌ జరగనుంది. బీఆర్‌ఎస్‌ నుంచి మాజీ జెడ్పీ వైస్‌చైర్మన్‌ నవీన్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్‌ నుంచి యువ పారిశ్రామికవేత్త, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు మన్నె జీవన్‌రెడ్డి పోటీపడుతున్నారు. గెలుపు ఖాయమని చెబుతున్న బీఆర్ఎస్ చివరికి జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లను గోవా క్యాంప్ కు ఎందుకు తరలించిందో అర్థం కావడంలేదు.

పార్టీ ఇంత ఇబ్బందికరపరిస్థితి ఎదుర్కొంటే.. పార్టీలో ఉన్నవారైన ఓ మాట మీద ఉండటం లేదు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు తయారైయ్యారు. ఒకప్పుడు అధిష్టానం గీసిన గీత దాటడానికి భయపడిన నేతలు ఇప్పుడు… అధినేత ఎదుటే కొట్లాటకు దిగుతున్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, రావుల శ్రీధర్‌ రెడ్డి తిట్టుకున్నారు. ఫేస్ టు ఫేస్ నిలబడ్డారు. దీంతో సమీక్షకు హాజరైన నాయకులంతా అవాక్కయ్యారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యే మాగంటిపై రావుల శ్రీధర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. పార్టీ కార్యక్రమాల్లో తనకు ప్రాధాన్యత ఇవ్వట్లేదని ఆరోపించారు. శ్రీధర్‌రెడ్డిని వేదికపైనే కూర్చోబెట్టి బుజ్జగించారు తలసాని శ్రీనివాస్ యాదవ్. ఇదంతా పక్కన పెడితే.. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంపై నిర్వహించిన సమావేశానికి సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకు సాయికిరణ్ యాదవ్ హాజరుకాలేదు. అంతేకాదు.. కేటీఆర్ మీటింగ్ మొదలుపెట్టిన కాసేపటికే తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా వెళ్లిపోయారు. ఇలా పార్టీలో ఎవరికి నచ్చినట్టు వాళ్లు వ్యవహరిస్తున్నారు. బీఆర్ఎస్ లోని పరిస్థితులు చూస్తే ఆపార్టీ ఇక చరిత్రలో కలిసిపోవడం ఖాయమని చాలామంది విశ్లేషిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

YSRCP: వైసీపీ వాళ్ల ముఖాలు చూస్తే ఓటమి అర్థమవుతోందా.. సర్వేలతో సైతం పని లేదుగా!

YSRCP: ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఏ పార్టీకి అనుకూలంగా ఉందనే విషయం గురించి పెద్ద ఎత్తున సర్వేలు నిర్వహించారు. ఇలా లోకల్ సంస్థల నుంచి మొదలుకొని నేషనల్ చానల్స్ కూడా...
- Advertisement -
- Advertisement -