Traffic Rules: ట్రాఫిక్‌ రూల్స్‌ కామన్‌ పీపుల్స్‌కేనా.. పోలీసులకు వర్తించవా?

Traffic Rules: మనం రోడ్డుపై ప్రయాణిస్తున్న సమయంలో ఏమాత్రం ట్రాఫిక్ రూల్స్ పాటించకపోయిన వెంటనే ట్రాఫిక్ పోలీసులు మనల్ని ఆపి తగిన చలానా విధిస్తూ ఉంటారు. రూల్స్ కి విరుద్ధంగా బండి నడిపిన, ట్రాఫిక్ సిగ్నల్స్ క్రాస్ చేసిన, హెల్మెట్ ధరించకపోయినా,త్రిబుల్ రైడ్ చేసిన పోలీసులు వెంటనే బండి ఆపి బండి కీస్ తీసుకోవడమే కాకుండా మనకు వందలకు వందలు చలానా విధిస్తూ ఉంటారు. అయితే ఈ నిబంధనలు కేవలం సామాన్యులకు మాత్రమేనా పోలీసులకు వర్తించవా అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్స్.

పోలీసులు ట్రాఫిక్ రూల్స్ కు విరుద్ధంగా రోడ్లపై ప్రయాణం చేయడంతో ఇద్దరు మహిళలు పోలీసుల భరతం పట్టినటువంటి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకీ ఏం జరిగింది? ఎక్కడ జరిగింది అనే విషయానికి వస్తే ఉత్తర్ ప్రదేశ్ లోని ఘజియాబాద్‌లో రెండురోజుల క్రితం ఈ సంఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

 

రెండు రోజుల క్రితం తల్లీకూతుళ్లు స్కూటీపై ప్రయాణిస్తున్నారు.అయితే వీరి కంటికి ట్రాఫిక్ రూల్స్ పాటించని పోలీసులు ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తుండడం గమనించారు. దీంతో వారిని అనుసరించిన ఈ తల్లి కూతుర్లు వారిని ఆపే ప్రయత్నం చేసిన మరింత వేగంగా ప్రయాణించారు. అయితే ఈతంగాన్ని మొత్తం తల్లి వీడియోగా చిత్రీకరించారు. హెల్మెట్ లేకుండా పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్నటువంటి ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

ఇలా ట్రాఫిక్ రూల్స్ కి విరుద్ధంగా పోలీసుల ప్రయాణం చేయవచ్చు కానీ సామాన్య ప్రజలు చేయకూడదా అంటూ ప్రశ్నిస్తున్నారు. దీంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ట్రాఫిక్ పోలీసులు చేసేదేమీ లేక సదరు పోలీసులకు వెయ్యి రూపాయల జరిమానా విధించారు.ఇక ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతోమంది నెటిజన్స్ ఆ తల్లి కూతుర్ల పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -