YCP: ఇద్దరు మహిళలే వైసీపీ పునాదులు కూల్చబోతున్నారా.. ఏం జరిగిందంటే?

YCP: వైఎస్ షర్మిల ఏపీ రాజకీయాల్లో అడుగుపెట్టినప్పటి నుంచి రోజుకో హాట్ టాపిక్‌తో జనంలోకి వస్తున్నారు. అది కొందరికి బ్రేకింగ్ న్యూస్ అయితే.. మరి కొందరికి షాకింగ్ న్యూస్ అవుతోంది. ఏది ఏమైనా ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో తన కోసం చాలా ఎక్కువ స్పేస్ క్రియేటే చేసున్నారు షర్మిల. నిజానికి మీడియాలో జగన్, చంద్రబాబు, పవన్ కంటే ఎక్కువ కవరేజ్ షర్మిలకే దొరుకుంతోంది. 3 బలమైన పార్టీల మధ్య ఎప్పుడో మర్చిపోయిన కాంగ్రెస్‌, షర్మిలకు అసలు స్పేష్ ఉండదని అనుకున్నారు. కానీ, షర్మిల సీన్ రివర్స్ చేశారు.

ఇవాళ షర్మిలను వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత రెడ్డి కలవడం హాట్ టాపిక్‌గా మారింది. ఇడుపులపాయలో షర్మిల దగ్గరకు సునీత వెళ్లారు. వీరిద్దరి మధ్య సుమారు 2 గంటల పాటు చర్చలు జరిగాయి. వివేకాహత్య కేసు గురించి చర్చించినట్టు తెలుస్తోంది. దీంతో పాటు ప్రధానంగా ప్రస్తుత రాజకీయాలపై మాట్లాడినట్టు సమాచారం. సునీత కాంగ్రెస్ లో చేరి కడప ఎంపీగా పోటీ చేస్తారని గత కొంతకాలంగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారానికి బలం చేకూర్చేలా వారిద్దరి భేటీ ఉంది. పైగా రెండు గంటలకుపై ఇద్దరూ జిల్లా రాజకీయాలపై చర్చించారని సమాచారం.

 

అయితే, ఈ ఇద్దరూ కలిస్తే ఇక జగన్ దుకాణం బంద్ అవుతుందని కడప వైసీపీ నేతలే లోలోపల చర్చించుకుంటున్నారు. వివేకాహత్య కేసు వెనక కీలక నిందితుడిగా అవినాష్ రెడ్డి ఉన్నారు. ఆయన సీబీఐ విచారణకు పూర్తిగా సహకరించడం లేదు. కానీ, ఈ విషయంలో జగన్.. అవినాష్ కు సహకరిస్తున్నారని పరిస్థితులు తెలియజేస్తున్నాయి. అసలు వివేకాహత్యలో జగన్ పాత్ర కూడా ఉందని విపక్షాలు చేస్తున్న విమర్శలకు జగన్ వ్యవహారం బలాన్ని చేకూరుస్తోంది. వివేకాహత్యనే రాజకీయ వ్యూహంగా వాడుకొని గత ఎన్నికల్లో జగన్ అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ తనకు సహకరిస్తారని సునీత భావించారు. అన్నే సీఎం కనుక వివేకా హత్య కేసు నిందితులను ఈజీగా పట్టుకోవచ్చిన ఆశపడ్డారు. కానీ, కాలం గడిచేకొద్ది ప్రతిపక్షాల ఆరోపణలను నిజం చేసేలా జగన్ వ్యవరించారు. వైసీపీ నేతలు, జగన్ సొంత మీడియా చివరికి వివేకాహత్య వెనక సునీత ఉన్నారని ప్రచారం చేశారు. దీంతో, ఆమెకు అప్పుడు తత్వం బోధపడింది. ఇక చేసేమీ లేక ఆమె ఒంటిరి పోరాటం చేస్తున్నారు. షర్మిల కూడా సునీతకు తన తండ్రి హత్యకేసులో సపోర్టు చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఆమె కాంగ్రెస్ లో చేరితే ఓ వైపు న్యాయపోరాటం, మరోవైపు రాజకీయ పోరాటం రెండు ఒకేసారి.. అది కూడా తోబుట్టువులతో జగన్ ఎదుర్కోవాల్సి ఉంటుంది.

 

 

షర్మిల ఒక్కరే ఏపీ పాలిటిక్స్‌లోకి వచ్చేసరికి జగన్ అండ్ వైసీపీ టీం విలవిలలాడిపోతున్నారు. అలాంటిది ఆమెకు సునీత కూడా తోడైతే వైసీపీ కనుమరుగవ్వడం ఖాయంగా తెలుస్తోంది. జగన్ ఎప్పుడూ ఓ మాట చెబుతూ ఉంటారు. దేవుడు స్క్రిప్ట్ అని అంటూ ఉంటారు. ఇప్పుడు ఇవే మాటలను టీడీపీ వాళ్లు జగన్ పై సంధిస్తున్నారు. దేవుడు చాలా అద్భుతంగా స్క్రిప్ట్ రాశారని అంటున్నారు. గత ఎన్నికల్లో ఏ వివేకాహత్య కేసును వాడుకొని జగన్ అధికారంలోకి వచ్చారో. అదే హత్యకేసు జగన్ ఓటమికి కారణం అవుతుందని అంటున్నారు. అంతేకాదు.. గత ఎన్నికల్లో జగన్ గెలుపునకు పనిచేసిన షర్మిల, సునీత.. ఈ ఎన్నికల్లో వైసీపీ ఓటమికి పని చేస్తున్నారని సెటైర్లు వేస్తున్నారు. దీన్నే దేవుడి స్క్రిప్ట్ అని తెగ వైరల్ చేస్తున్నారు. ఈ ఇద్దరితో వైసీపీ పునాదులు కూలడం ఖాయంగా చెప్పుకుంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -