Viveka Murder Case: వివేకానందరెడ్డి హత్య కేసుకు ఐదు సంవత్సరాలు.. దోషులు ఇంకెప్పుడు దొరుకుతారు జగన్?

Viveka Murder Case: వివేకాహత్య కేసు వైసీపీ నేతల్లో గుబులు పుట్టిస్తోంది. ఓ వైపు షర్మిల, మరోవైపు వైఎస్ సునీత వివేకహత్య కేసు అస్త్రాన్ని జగన్ పై సందిస్తున్నారు. ఇక.. చంద్రబాబు, లోకేష్ కూడా అడపా దడపా ఈ కేసు ప్రస్తావన తీస్తున్నారు. గత ఎన్నికల ముందు జరిగిన వివేకాహత్య కేసు విషయంలో వైసీపీ, సాక్షీ మీడియా పెద్ద డ్రామా నడిపించాయి. 2019 ఫిబ్రవరి 15న ఉదయం ఏడు గంటలకు జగన్ బాబాయ్ వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయారని సాక్షిలో స్క్రోలింగ్ నడిపించారు. అదే రోజు ఉదయం తొమ్మిది గంటలకు వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయారని విజయసాయి రెడ్డి ప్రకటించారు. అదే రోజు ఉదయం 11 గంటలకు వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయారని సాక్షిలో బ్రేకింగులు నడిచాయి. అయితే.. అంత వరకూ సాక్షికి మాత్రమే పరిమితమైన ఆ వార్త కాసేపటికే అన్ని చానెల్ కు విస్తరించింది.

అన్ని ఛానెల్స్ లోనూ వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయారని వార్తలు రాసుకొచ్చాయి. కాసేపట్లోనే అంత్యక్రియలకు రెడీ అవుతున్నారు. పోస్టుమార్టం వద్దు, కేసు వద్దని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. దీంతో.. అనుమానం వచ్చిన వివేకా కుమార్తె సునీత పోస్టు మార్టం చేయాలని పట్టుబట్టారు. దీంతో.. అసలు విషయం బయటకు వచ్చింది. వివేకానందరెడ్డిని ఎవరో ఘోరంగా నరికి చంపారని తేలింది. కానీ.. ఇంట్లో చూస్తే సాక్ష్యాలు లేవు. అక్కడ నుంచి వైసీపీ డ్రామాలు మొదలు పెట్టింది. వివేకానందరెడ్డిని చంద్రబాబు హత్య చేయించారని అన్నారు. ఓటమి భయంతో ప్రజలను భయాందోళనకు గురి చేసి గెలవాలని చూస్తున్నారని ఆరోపించారు. దీనిపై సీబీఐ విచారణ జరపాలని అప్పట్లో జగన్ డిమాండ్ చేశారు. దీన్ని డిఫెండ్ చేసుకోవడం తప్ప చంద్రబాబు రెండో ఆఫ్షన్ లేకుండా పోయింది. నిజానికి సడెన్ గా వచ్చిన ఈ ప్రమాదం నుంచి ఎలా బయటపడాలో కూడా చంద్రబాబుకి తట్టలేదు. కానీ.. సొంత బాబాయ్ ని పోగొట్టుకున్నాడనే సింపతీ మాత్రం జగన్‌కు వర్క్ అవుట్ అయింది.

రెండు నెలలు తిరిగే సరికి జగన్ సీఎం అయ్యారు. ఆ తర్వాత నెమ్మదిగా ఈ కేసును పక్కన పెడతూ వచ్చారు. సీబీఐ విచారణ అవసరం లేదని.. తామే విచారణ చేస్తామని చెప్పారు. కొన్ని రోజులకు వివేకా హత్యలో రాజకీయ కుట్రల లేవని.. కుటుంబ కలహాలే కారణమని వైసీపీ ప్రచారం చేసింది. అంతేకాదు.. ఈ హత్యకు మతం రంగు కూడా పులిమింది. ఓ ముస్లిం మహిళతో వివేకాకు వివాహేతర సంబందం ఉందని.. ఆమెతో పుట్టిన కుమారుడికి ఆస్తి ఇచ్చేందుకు వివేకా సిద్దమయ్యారని ప్రచారం చేసింది. అక్రమ సంతానానికి ఆస్తి ఇవ్వడం ఇష్టం లేక వైఎస్ సునీత, తన భర్త ఆయన్ని హత్య చేశారని చెప్పుకొచ్చారు. ఎవరు చంపారో ఎందుకు చంపారో అనే ప్రకటనలు ఇప్పుడు కూడా వైసీపీ, సాక్షి మీడియానే చెబుతోంది కానీ.. సీబీఐ చెప్పలేదు.

వైఎస్ అవినాష్ రెడ్డిని విచారించకుండా జగన్ చేయాల్సిన ప్రయత్నాలు అన్ని చేస్తున్నారు. దస్తగిరి అప్రూవర్ గా మారితే ఆయన్ని దాడి కేసులో కడప జైల్లో వేశారు. ఇలా ఈ కేసులో ఎవరు అడ్డంగా ఉంటే వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వైసీపీ మొదట ఆరోపించినట్టు చంద్రబాబు హత్య చేయించారో .. లేదంటే.. ఇప్పుడు సాక్షి ఆరోపిస్తున్నట్టు సునీతయే హత్య చేయించారో తేలాలంటే.. నిందితులు విచారణకు హాజరుకావాలి. విచారణకు నిందితులు సహకరిస్తే.. సీబీఐ అధికారులపై తిరిగి కేసులు పెట్టకపోతే.. ఇప్పటికే హంతకులు ఎవరో తెలిసేది. కానీ. జగన్ ప్రభుత్వం ఈ విచారణను అడుగడుగునా అడ్డుకుంటుంది. అందుకే ఐదేళ్లు అయినా ఆ కేసు విచారణ అతీగతీ లేకుండా పోతుంది. వైఎస్ సునీతకు న్యాయం జరగడం లేదు. అందుకే.. చెల్లెలికే న్యాయం చేయని వ్యక్తి రాష్ట్రం ప్రజలకు ఏం న్యాయ చేస్తాడని సునీత ప్రశ్నించారు. వైసీపీకి ఓటు వేయొద్దని పిలుపునిచ్చారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -