Jagan – KCR: జగన్ కు చెల్లెళ్ల గండం.. కేసీఆర్ కు కూతురు గండం.. తెలుగు రాష్ట్రాల నేతలకు కుటుంబ సభ్యులే శాపమా?

Jagan – KCR: బల్లు ఓడలు .. ఓడలు బల్లు అవుతాయని అంటారు. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు చూస్తే ఈ విషయం క్లియర్ గా అర్థం అవుతుంది. ఎందుకంటే.. ఐదేళ్ల క్రితం రాజకీయా పరిణామాలు, ఇప్పటి రాజకీయ పరిణామాలను పోల్చి చూస్తే విచిత్రంగా ఉంటుంది. ఐదేళ్ల క్రితం బీఆర్ఎస్ అధినేత మాటలకు, దూకుడుకు అడ్డే ఉండేది కాదు. సేమ్ ఏపీలో జగన్ చెల్లిని, బాబాయ్ హత్యను వాడుకొని చంద్రబాబును ఉక్కిరిబిక్కిరి చేసేవారు. కానీ.. ఇప్పుడు మొత్తం రివర్స్ అయింది. కేసీఆర్, జగన్ మిత్రులు కావడం ఓ విచత్రమైతే.. ఇద్దరి రాజకీయ భవిష్యత్‌ను కూడా శాసించేలా కుటుంబ సభ్యులే మారడం మరో విచిత్రం.

మొదట జగన్ విషయానికి వచ్చినట్టు అయితే.. తండ్రి ఆశయాలను నిజంగా చేస్తానని తెలంగాణ నుంచి ఏపీకి వచ్చిన సొంత చెల్లెలు షర్మిల.. తన తండ్రి హత్యకేసులో న్యాయపోరాటం చేస్తున్న కజిన్ చెల్లెలు సునీత ఇద్దరూ జగన్ ను సవాల్ చేస్తున్నారు. కుటుంబంలో సొంత వ్యక్తులే వైసీపీ సర్కార్ ను నిందిస్తూ జగన్ పైనా.. తన భార్య భారతీ పైన, వారి కుటుంబానికి చెందిన అవినాష్ రెడ్డిపైనా తీవ్రమైన విమర్శలు చేస్తూ జగన్ పై రాజకీయ యుద్దాన్ని ప్రకటించారు. సొంత చెల్లెల్లకే న్యాయం చేయని వ్యక్తి రాష్ట్ర ప్రజలను న్యాయం చేస్తాడా అని ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.

ఈ ప్రభుత్వం రక్తపు పునాదులపై నిలబడిందని సునీత ఘాటు వ్యాఖ్యలు చేశారు. కోడికత్తి, వివేకాహత్య లాంటి కేసుల మీదే ప్రభుత్వం ఏర్పడిందని.. అవే కేసులు ప్రభుత్వాన్ని కూలదోస్తాయని అన్నారు. చెల్లెలకు హత్యలను అంటగట్టడం ఎంతవరకూ న్యాయమని షర్మిల ప్రశ్నించారు. అధికారం కోసం ఎంతకైనా దిగజారుతారా? అని నిలదీశారు. షర్మిల, సునీతకు తోడు.. ఇప్పుడు వైఎస్ వివేకా భార్య సౌభాగ్యమ్మ కూడా తోడయ్యారు. వైసీపీకి ఓటు వేయొద్దని పిలుపునిచ్చారు. అంతేకాదు.. హంతకులను కాపాడేవారు ప్రజలను ఎలా కాపాడుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలా ఇంట్లో వ్యక్తులే జగన్ కు శత్రువుల్లా మారారు.

ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విషయానికి వచ్చినట్టు అయితే.. తన కుమార్తె కవితే బీఆర్ఎస్ భవిష్యత్ కు గండంగా మారారు. అసెంబ్లీ ఎన్నికల్లో లిక్కర్ స్కాం కేసు బీఆర్ఎస్, బీజేపీనికి ఇరుకున పెట్టింది. బీఆర్ఎస్ కవితను అరెస్ట్ చేస్తానని చెబుతుంది కానీ.. చేయడం లేదని.. కేసీఆర్, మోడీ చీకటి ఒప్పందం కుదుర్చుకున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ ఆరోపణలను నమ్మిన ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టారు. అయితే, కవిత ఎపిసోడ్ తమను అధికారానికి దూరం చేసిందనుకుంటున్న కమలనాధులు పార్లమెంట్ ఎన్నికల సమయానికి కవితను అరెస్ట్ చేశారు. లిక్కర్ కేసులో తమ చిత్తశుద్ధి నిరూపించుకోవడానికి ఇలా చేశారు. దీంతో.. మరోసారి కేసీఆర్ రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే.. కవిత అరెస్ట్ కావడంతో.. లిక్కర్ స్కాంలో కవిత భాగస్వామి అని అటు కాంగ్రెస్, బీజేపీ విమర్శలను పెంచుతాయి. ఇలా కవిత ఎపిసోడ్ మరోసారి బీఆర్ఎస్ కు గండంగా మారబోతుంది. ఇద్దరు మిత్రులకు కూడా ఈ ఎన్నికల్లో కుటుంబ సభ్యులే గండంగా మారారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -