Cool Drinks: ప్రతిరోజూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా.. అంత ప్రమాదమట!

Cool Drinks: ఈ రోజుల్లో కూల్ డ్రింక్ తాగటం ఎంత అలవాటుగా మారింది అంటే చాలామంది మంచినీళ్లకు బదులు దాన్నే తాగుతున్నారు. బిర్యానీ తింటున్నారు అంటే దానికి కాంబినేషన్ గా కూల్ డ్రింక్ కంపల్సరిగా పక్కన పెట్టుకుంటున్నారు. అప్పుడప్పుడు ఇలా చేస్తే పర్వాలేదు.

 

కానీ తరచుగా కూల్ డ్రింక్స్ తాగటం అనేది ఎంత పెద్ద ప్రమాదమో అర్థమయ్యేలాగా చెప్తుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఇంతకీ విషయం ఏంటంటే ఈ మధ్యనే కూల్ డ్రింక్ తాగే వాళ్ళకి డబ్ల్యూ హెచ్ ఓ షాకింగ్ న్యూస్ ఒకటి జారీ చేసింది. కృత్రిమ తీపి క్యాన్సర్ కి కారణం అవుతుంది. ఆస్పర్టెమ్ అనే కృత్రిమ తీపి సుక్రోజ్ కంటే సుమారు 200 రెట్లు తీపి ఎక్కువగా ఉంటుంది.

దీనివల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని అంతర్జాతీయ క్యాన్సర్ పరిశోధనా సంస్థ జూలైలో ప్రకటించేందుకు ఏర్పాటు చేస్తుంది. అస్పర్టెమ్ లో ఎలాంటి క్యాలరీలు ఉండవు. దీనిని వినియోగించేందుకు 2009లో భారత్ ఫుడ్ సేఫ్టీ అండ్ రెగ్యులేషన్ సంస్థ అనుమతినిచ్చింది.

 

బేవరేజెస్ మార్కెట్ షేర్లు అతిపెద్దదైన రెడీ టు డ్రింక్ టీలలో 90 శాతం వరకు దీన్ని వాడుతున్నారు. మిగతా అవార్డుతో పోలిస్తే ఈ అస్పర్టెమ్ వాడకంతో క్యాన్సర్ ప్రమాదం కాస్త ఎక్కువే అంటూ ఏడాది ఫ్రాన్స్ లో చేపట్టిన ఒక అధ్యయనంలో తేలింది. 1965లో రసాయన శాస్త్రవేత్త జేమ్స్ ఎం స్లాటర్ అస్పరేటం ను కనుగొన్నారు. కార్బోనేటెడ్ పానియాల్లో తీపి రుచికి ప్రత్యామ్నాయంగా దీనిని ఉపయోగిస్తారు.

 

కేవలం ఈ ఆస్పరేటం ని కూల్ డ్రింక్స్ మాత్రమే కాకుండా డైట్ సోడాలు మార్స్ ఎక్స్ట్రా చూయింగ్ గమ్ కొన్ని రకాల స్నాపిల్ డ్రింక్స్ వంటి పలు ఉత్పత్తులలో దీనిని ఉపయోగిస్తారు. ఆస్పరిక్ యాసిడ్, ఫెనిలాలనైన్ అనే రెండు ఆమెను ఆమ్లాలతో ఈ స్వీట్ అనర్ ని తయారు చేస్తారు ఇందులో కొద్ది మొత్తంలో మిథునల్ కూడా ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు కూల్ డ్రింక్స్ తాగే వాళ్ళు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి

 

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -