Puncture Mafia: హైదరాబాద్, బెంగళూరులో నివశిస్తున్నారా.. ఈ మాఫియా బారిన పడొద్దు!

Puncture Mafia: ప్రస్తుతం నగరాలలో దోపిడితనం ఎక్కువగా కనిపిస్తుంది. ఎక్కడ చూసినా దొంగతనాలు, మాఫియాలు జరుగుతున్నాయి. దీంతో నగరంలో నివసించే జనాలు భయపడిపోతున్నారు. ఇప్పటికే ఎన్నో రకాల మాఫియాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే హైదరాబాద్, బెంగళూరులో నివసించే వాళ్లకు గత కొన్ని రోజుల నుండి పంక్చర్ మాఫియా ఎదురవుతుంది.

మామూలుగా బయట వాహనాలు పెడితే పెట్రోల్, డీజిల్ దొంగతనం చేసే వాళ్లను చూసాం. కానీ పంక్చర్ సెంటర్లకు బాగా డబ్బులు రావాలని పంక్చర్ మాఫియా చేస్తున్నారు కొందరు దుండగులు. నిజానికి ఇది వినటానికి ఆశ్చర్యంగా ఉంది కదా. కానీ ఇది నిజంగా జరుగుతున్న సంఘటన. ఈ మధ్యనే
వరుసగా ఇటువంటి మాఫియా జరుగుతుందని బయటపడింది. ఇప్పటికే బెంగళూరులో పంక్చర్ సెంటర్ల వద్ద వీటికి మాటికి తమ వాహనాలు పంక్చర్ అవుతున్నాయని వాపోతున్నారు వాహనదారులు.

 

నగరంలోని పంక్చర్ షాపులకు ఒక కిలోమీటర్ దూరంలో రోడ్డుపై కొందరు దుండగులు కరెక్ట్ టైర్లకు గుచ్చుకునే విధంగా చిన్న చిన్న మేకులు, మొనదేలిన తీగలు వేయటంతో పంక్చర్ షాపులు బాగా సొమ్ము చేసుకుంటున్నట్లు పోలీసులు తెలుపుతున్నారు. దీంతో పోలీసులు అనేపాళ్య, నంజప్ప జంక్షన్, అపేరా కూడలి వంటి ప్రాంతాలలో కిలోల చొప్పున మేకులు, ఇనుప చువ్వలను వెతికి తీసినట్లు తెలిసింది. ఇక దత్తపీఠానికి వెళ్లే మార్గంలో మేకులు ఎక్కువగా సేకరిస్తున్నారని తెలిసింది.

 

దీంతో పోలీసులు పంక్చర్ మాఫియా ఆ ప్రాంతంలోని తిరుగుతున్నట్లు గమనించారు. ఇక ఎస్సై మహమ్మద్ ఇమ్రాన్ అలీ.. సీసీ కెమెరాలను ఏర్పాటుచేసి మాఫియా చేసే ఆగడాలను అరికడతామని వాహనదారులకు ధైర్యం ఇచ్చారు. పోలీసులకు కూడా తలనొప్పిగా మారిన పంక్చర్ మాఫియాను అరికట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని.. వాహనదారులకు మద్ధతుగా వ్యవహరిస్తామని ఆయన తెలిపారు. హైదరాబాద్ లో కూడా పలు చోట్ల ఇటువంటివి జరుగుతున్నట్లు తెలుస్తుంది.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -