Over Sleeping: అతిగా నిద్రపోతున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే?

Over Sleeping: నిద్ర అన్నది ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యం. కంటి నిండా నిద్రపోయినప్పుడే శరీరానికి కావాల్సిన విశ్రాంతి దొరుకుతుంది. సరిగా నిద్ర పోకపోతే ఎన్నో రకాల సమస్యలు ఎదురవుతాయి. మరి ముఖ్యంగా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. మానవ శరీరంలోని అవయవాల పని తీరు సక్రమంగా ఉండాలంటే వాటికి విశ్రాంతి అవసరం. ఆ విశ్రాంతి నిద్ర ద్వారా దొరుకుతుంది. నిద్ర ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు కూడా చెక్ పెడుతుంది. ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవితంలో ఎంతోమంది సరిగా కంటి ఇంట నిద్రపోకుండా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు.

 

కాగా వైద్యులు ప్రతిరోజు ఏడు నుంచి ఎనిమిది గంటలపాటు విశ్రాంతి తీసుకోవాలి అని చెబుతూ ఉంటారు. అయితే నిద్రపోవడం మంచిదే కానీ అతిగా నిద్రపోవడం వల్ల కూడా అనేక రకాల అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. మరి అతిగా నిద్ర పోవడం వల్ల ఎటువంటి సమస్యలు ఎదురవుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఎక్కువగా నిద్రపోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అధికంగా నిద్రపోవడం వల్ల శరీరంలో షుగర్ ను శక్తిగా మార్చే ప్రక్రియ దెబ్బతినే డయాబెటిస్ కు దారితీస్తుంది. ఒక అధ్యయనం ప్రకారం అతిగా నిద్రపోవడం వల్ల గుండెదబ్బులకు కూడా దారితీస్తుంది.

 

8 గంటలకంటే ఎక్కువగా నిద్ర పోయినా వారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 35 శాతం ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా మెదడుకు రక్తం సరఫరా నిలిచిపోయినపుడు లేదా రక్తం సరఫరాకు ఆటంకం కలిగినపుడు బ్రేయిన్‌ స్ట్రోక్‌లు వస్తుంటాయి. రాత్రి సమయంలో 8 గంటలు నిద్రపోతున్న వారికంటే 9 గంటల కంటే ఎక్కువ నిద్రపోతున్న వారు 23 శాతం అధికంగా బ్రేయిన్‌ స్ట్రోక్‌ బారిన పడినట్లు తేలింది. అలాగే ఎనిమిది గంటలకంటే ఎక్కువ సేపు నిద్రపోతున్న వారు 21 శాతం మంది ఊబకాయం సమస్యతో బాధపడుతున్నట్లు ఒక పరిశోధనలో తేలింది. వాటితో పాటుగా ఒత్తిడి, తలనొప్పి వంటి సమస్యలు కూడా వస్తాయి.,

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -