Ram Charan: డబ్బులు ఇచ్చి చరణ్ ను ప్రమోట్ చేస్తున్నారా.. ఏమైందంటే?

Ram Charan: ప్రపంచం అంతా అంతర్జాలం అయిపోయింది. ఎన్నో రకాల విన్యాసాలు ఇక్కడ జరుగుతున్నాయి. ఒక వ్యక్తి ఉన్నతి ఆయన కష్టం మీదనే ఆధారపడి ఉండేది. ఇప్పుడు మాత్రం, సోషల్‌ మీడియో లేనిది ఉన్నట్లు ప్రచారం చేస్తున్నారు. అసలైన వారిని తొక్కేస్తున్నారు. ఇదంతా ఎందుకంటారా కింద చదివితే మీకే తెలుస్తుంది.

 

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ని డబ్బులు ఇచ్చి మెగా ఫ్యామిలీ ప్రమోట్ చేస్తుందనే టాపిక్‌ సంచలనంగా మారింది. కొన్ని అంశాలను పరిశీలిస్తే అవుననే రీజన్‌ కూడా కనిపిస్తుంది. సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులు సైతం కొందరు అవుననే అంటున్నారు. లేకపోతే ఆర్ఆర్ఆర్ సినిమాతో ఒక్కసారిగా ప్రపంచ స్థాయిలో చరణ్ గుర్తింపు సంపాదించుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అదే సినిమాలో మరో హీరోగా చేసిన తారక్ పేరు ఎక్కడ వినిపించకపోవడం ఏంటని పలువురు ఫాన్స్ మండిపడుతున్నారు.

 

 

తాజాగా చిరంజీవి చేసిన ట్విట్ సైతం వాటికి ఆజ్యం పోసేలా ఉంది. రీసెంట్‌గా జేమ్స్ కామరూన్ చరణ్‌ని పొగిడేసిన వీడియోను చిరంజీవి తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేస్తూ పుత్రోత్సాహంతో మురిసిపోయాడు. అంత పెద్ద సినిమా తీసిన స్టార్ డైరెక్టర్ రాజమౌళిని, తన కొడుకుతోపాటు నటించిన మరో హీరో ఎన్టీఆర్‌ని అస్సలు ప్రస్తావించలేదు. ఈ క్రమంలోనే తెర వెనుక ఏదో జరుగుతుందన్న న్యూస్ హాట్ టాపిక్‌గా మారింది.

 

 

ఇటీవల పలు అంతర్జాతీయ అవార్డులను ఆర్‌ఆర్‌ఆర్‌ సొంత చేసుకుంది. హాలీవుడ్ క్రిటిక్స్‌లో ఏకంగా నాలుగో అవార్డులను సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో పలువురు స్టార్ సెలబ్రిటీస్ అందరూ రాంచరణ్, రాజమౌళిని ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు . అయితే తారక్ పేరు మాత్రం ఎక్కడా కనిపించట్లేదు, వినిపించట్లేదు. ఈ క్రమంలోనే మెగా ఫ్యామిలీ కావాలని తారక్‌ని తొక్కేస్తుందని..దానికి రాజమౌళి కూడా సపోర్ట్ చేస్తున్నారని ఆయన ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అందుకే చరణ్‌ని డబ్బులు ఇచ్చి మరి ఓ రేంజ్‌లో హంగామా చేస్తున్నారని విరుచుకుపడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -