Relationship: పోర్న్ ఎక్కువగా చూస్తున్నారా.. ఇది తెలుసుకోవాల్సిందే?

Relationship: ప్రస్తుత రోజుల్లో యువత చాలామంది పోర్న్ వీడియోలకి బాగా ఎడిక్ట్ అయిపోయారు. స్మార్ట్ ఫోన్లో వినియోగం పెరిగిపోవడంతో చాలామంది టెక్నాలజీని ఇలాంటి చెడ్డవాటికి ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. చాలామంది చిన్నపిల్లలు కూడా ఈ పోర్న్ వీడియోలకు అలవాటు పడిపోతున్నారు. చేతిలో స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ ఉంటే చాలు చాలామంది ఆ వీడియోలు చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు. రోజురోజుకి పోర్న్ వీడియోలు చూసేవారి సంఖ్య క్ర‌మంగా పెరిగిపోతోంది. కరోనా మహమ్మారి తర్వాత పోర్న్ వీడియోలు చూసే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది.

అయితే భార‌త్‌లో పోర్న్ సైట్ల‌పై నిషేధం విధించినా కూడా ఇంటర్నెట్ లో ఈ వీడియోలు కనిపిస్తూనే ఉంటాయి. అయితే, పోర్న్ వీడియోలు అతిగా చూస్తే ప్ర‌మాద‌మే అని హెచ్చరిస్తున్నారు నిపుణులు. మరి పోర్న్ వీడియోలు అధికంగా చూడడం వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. చాలామంది ఆ పోర్న్ వీడియోలు చూస్తూ సంతోషాన్ని పొందుతూ ఉంటారు. కానీ ఆ నిమిషంలో సంతోషంగా అనిపించినా కూడా ఆ తర్వాత అది సో పాయిజన్ల ఎక్కి మిమ్మల్ని పోర్న్ వీడియోలకు పూర్తిగా ఎడిక్ట్ చేసేస్తుంది. పోర్న్ వీడియోలు ఎక్కువగా చూసేవారిలో అంగ స్తంభన సమస్యలు ఎక్కువగా ఉంటాయి. పోర్న్ అతిగా చూసేవారికి సాధారణ సెక్స్‌పై ఆసక్తి క్ర‌మంగా త‌గ్గిపోతుంది. ఇత‌రుల సెక్స్‌ను చూస్తూ ఆనందించే మానసిక సమస్యలు వస్తాయి.

 

స్త్రీలు పురుషులతో పోల్చుకుంటే పురుషులు పోర్న్ వీడియోలను అధికంగా చూస్తున్నట్లు అధ్యయనంలో తేలింది. కొంతమంది ఆ వీడియోని టైంపాస్ గా చూస్తుంటే మరి కొంతమంది వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నట్లు అధ్యయనంలో తేలీంది. అయితే ఇలా పోర్న్ వీడియోలకు ఎడిక్ట్ అయిన వారిలో 23 శాతం మంది పురుషులకు అంగస్తంభన సమస్యలు వస్తున్నాయని తేలింది. పోర్న్ చూస్తూ హస్త ప్రయోగానికి అలవాటు ప‌డేవారు త‌మ భాగ‌స్వామితో సెక్స్ చేసే స‌మ‌యంలో మాత్రం అంగం స్తంభన సమస్యల‌తో ఇబ్బంది ప‌డుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా ఆ పోర్న్ వీడియో చూసే అలవాటుని మానుకోవడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి. లేదంటే ఫ్యూచర్లో సెక్సువల్ గా ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -