Puja: దేవుడికి పూజ చేస్తున్నారా.. ఈ విషయాలు గుర్తుంచుకోవాల్సిందే?

Puja: సాధారణంగా చాలామంది పూజ చేసేటప్పుడు తెలిస్తే తెలియక కొన్ని రకాల తప్పులు చేస్తూ ఉంటారు. వాటి వల్ల కొన్ని రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇకపోతే పూజ చేసేటప్పుడు కచ్చితంగా కొన్ని నియమాలను గుర్తించుకోవాలి. మరి ఆ నియమాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మన ఇంట్లోని పూజా మందిరంలో ఏవైనా దేవతా విగ్రహాలు ఆరు ఇంచుల లోపు మాత్రమే ఉండాలి. అంతకంటే పెద్దగా ఉన్న విగ్రహాలు ఇంట్లో ఉంచుకోరాదు. అలాగే ఎప్పుడు కూడా మంత్రపుష్పం సుప్రభాతం కూర్చొని చదవకూడదు.

పరమశివుడికి పవళింపు సేవ ఎప్పుడు నిలబడి చేయరాదు. నుదిటిన బొట్టు విభూతి లేదంటే కనీసం బొట్టు అయినా లేకుండా పూజ చేయకూడదు. ఈశ్వరుడికి అలాగే గురువుకి ఎప్పుడు ఒక చేతితో నమస్కారం చేయకూడదు. అలా చేయడం వల్ల పై జన్మలో చేతులు లేకుండా జన్మించడం చేతులు పోవటం లాంటివి జరుగుతాయి. ఈశ్వరునికి ఎప్పుడు వీపు చూపకూడదు. ఈశ్వరుని ఎదురుగా నిలబడి ఆత్మప్రదక్షిణ చేయకూడదు. ఈశ్వరుడికి చేసే దీపారాధన పరదేవతతో సమానం. ఆ దీపారాధనతో పుల్లలు కానీ, సాంబ్రాణి కడ్డికానీ, హారతి కర్పూరం కానీ మరి ఏదైనా కానీ వెలిగించకూడదు.

 

పూజ సమయమున ఈశ్వరుడు మన కంటే ఎత్తులో వుండాలి, అలానే పూజా వస్తువులు కుడివైపు నుంచి తీసుకోవాలి. ఎడమ చేయి పూజా విధులలో నిషేధం. రుద్రాక్షలు ధరించే వారు మద్యం, మాంసము, ఉల్లి, వెల్లుల్లి, మునగ, శ్లేషాత్మక పదార్ధాలు తినకూడదు. స్త్రీలు ఎప్పుడు తులసి దళాలు తుంచకూడదు. ఎల్లప్పుడూ పురుషులు మాత్రమే తులసీదళాలను తుంచాలి. స్త్రీలు ఎప్పుడు జుట్టు విరబోసుకొని ఇంట్లో తిరగకూడదు. అలా విరబోసుకుని తిరగడం వల్ల ఆ ఇంటికి ఇంట్లో ఉన్నవారికి ఆ శుభం కలుగుతుంది. అటువంటి ఇంట్లో లక్ష్మీదేవి నివసించదు. స్త్రీలు భర్తకి కనిపించడం వల్ల భర్తకి గండం. ఎప్పుడైన భర్తలు పని మీద బయటకు వెళ్తున్నప్పుడు స్త్రీలు జుట్టు విరబోసుకుని కనిపిస్తే వెంటనే వెనక్కి వచ్చి కాళ్లు కడుక్కొని కొద్దిసేపు కూర్చొని వెళ్లాలి. స్త్రీలు చెవి దిద్దులు లేకుండా భర్తకి కనపడరాదు. అలాకనపడితే భర్తకి గండం, శ్రేయస్సు కాదు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -