Ashok Chopra: విరాట్ కోహ్లీ రోహిత్ శర్మలకు తేడా ఇదే.. చిచ్చు పెట్టేసిన అశోక్ చోప్రా

Ashok Chopra: ఫ్యాన్ వార్ అనేది ఎక్కడైనా ఉంటుంది. అది సినిమాల్లోనైనా సరే క్రికెట్‌లోనైనా సరే. కొత్త నీరు వస్తుంటుంది.. పాత నోరు పోతుంటుంది. ఏ టైంలో ఉన్న ఆటగాళ్లు ఆ టైంలో గొప్పవాళ్లుగా ఉంటారు. అయితే కొంత మంది మాత్రమే కాలాతీతంగా ఉంటారు. ఇప్పుడు రోహిత్ శర్మ శకం నడుస్తోంది. ఇంతకు ముందు విరాట్ కోహ్లీ శకం నడిచింది. అసలే ఈ ఇద్దరి ఫ్యాన్స్ నెట్టింట్లో వాగ్వాదానికి దిగుతుంటారు. వారి గొడవ చాలదన్నట్టుగా ఇప్పుడు మాజీ క్రికెటర్, ప్రస్తుత క్రికెట్ విశ్లేషకుడు ఆకాశ్ చోప్రా నిప్పులు పోశాడు.

తన యూట్యూబ్ ఛానెల్‌లో ఆకాశ్ మాట్లాడుతూ కోహ్లీకి దూకుడెక్కువ. అతడు తాను ఇది చేయాలనుకుంటే కచ్చితంగా చేసేవాడంటూ చెప్పుకొచ్చాడు. మైదానంలో కూడా కోహ్లీ దూకుడుగా ఉండేవాడని అన్నాడు. ప్రత్యర్థి ఎవరనేది సంబంధం లేకుండా అదే దూకుడును కొనసాగించేవాడు. అస్సలు వెనక్కి తగ్గేవాడు కాదంటూ కోహ్లీ ప్రవర్తన గురించి చెప్పుకొచ్చాడు. అయితే కోహ్లీ ఉన్నంత దూకుడుగా అతడి జట్టు ఉండకపోయేదని అన్నాడు. దానికి అనేక కారణాలుండొచ్చు అయితే కోహ్లీ కూడా జట్టులో అగ్రెసివ్‌నెస్ గురించి చాలాసార్లు మాట్లాడాడని గుర్తు చేశాడు. కానీ పుజారా మాత్రం కోహ్లీ దూకుడు కారణంగా ఒక మ్యాచ్ లో రెండు సార్లు రనౌట్ అయ్యాడని గుర్తు చేశాడు. తన అభిప్రాయం ప్రకారం.. కోహ్లీ దూకుడు మంత్రాన్ని జట్టు సరిగా అర్థం చేసుకోలేదేమో అని చెప్పుకొచ్చాడు..

టెస్టులలో కోహ్లీ కెప్టెన్సీ స్థాయిని పెంచాడనడంలో సందేహమే లేదని బల్ల గుద్దినట్టు చెప్పాడు. టెస్టులలో అతడు ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగేవాడని, నిబంధనలకు కొత్త అర్థాన్ని చెబుతూ కోహ్లీ ముందుకు సాగేవాడని కితాబిచ్చాడు. కానీ అతడి జట్టులో మాత్రం ఆ ఫైర్ ఉండకపోయేదట.. అయితే రోహిత్ మాత్రం అలా కాదని అన్నాడు. కోహ్లీతో పోలిస్తే రోహిత్ శర్మ మైదానంలో హంగామా చేయడని అన్నాడు. ప్రశాంతంగా ఉండి జరగాల్సిన పని జరిపిస్తాడట. తన జట్టులో ఆత్మ విశ్వాసాన్ని నింపుతాడని కితాబిచ్చాడు.

కెప్టెన్ అండ ఉన్నాక జట్టులో ఆటగాళ్లు తప్పకుండా చెలరేగుతారనేది తెలిసిందే. మ్యాచ్ జరుగుతున్న సమయంలో రోహిత్.. కోహ్లీ అంత దూకుడుగా ఉండకపోయినా హిట్‌మ్యాన్ జట్టు మాత్రం దూకుడుగా ఉంటుందని తెలిపాడు. రోహిత్ ఆటగాళ్లకు అండగా నిలుస్తాడని తెలిపాడు. రెండు మూడు మ్యాచులు బాగా ఆడటం లేదనే కారణంతో ఆటగాళ్లను జట్టు నుంచి తీసేయడని, వారికి భరోసానిస్తాడని చెప్పుకొచ్చాడు.. అందుకే వాళ్లు చెలరేగుతున్నారంటూ చోప్రా తెలిపాడు. అయితే చోప్రా వ్యాఖ్యలు ఇప్పుడు అభిమానుల మధ్య చిచ్చు పెట్టేశాయి. ఇది ఏ స్థాయికి చేరుకుంటుందో చూడాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -