Asia Cup 2022: పాక్-భారత్ మధ్య మ్యాచ్.. టీమిండియా ప్రతీకారం తీర్చుకుంటుందా?

Asia Cup 2022: అత్యంత కీలకమైన ఆసియా కప్ రేపటి నుంచి ప్రారంభం కాబోతోంది. తొలి మ్యాచ్ లోనే పాక్ తో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పాక్- టీమిండియా మ్యాచ్ అంటేనే క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇరు జట్లు ఎప్పుడు మ్యాచ్ లు ఆడతాయా అని ఎదురుచూస్తూ ఉంటారు. ఇప్పుడు ఆసియా కప్ రూపంలో ఆ చాన్స్ రావడంతో క్రికెట్ అభిమానులకు సండే ఫన్ డే గా మారనుంది.

గత ఏడాది జరిగిన టీ20 వరల్డ్ కప్ లో టీమిండియాపై పాక్ గెలిచింది. కోహ్లీ కెప్టెన్ గా ఉన్న సమయంలో భారత్ పై పాక్ గెలిచింది. దీంతో ఇప్పుడు దానికి ప్రతీకారం తీర్చుకునేందుకు టీమిండియా గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది. టీమిండియా క్రికెటర్లు ప్రాక్టీస్ సెషన్లలో శ్రమిస్తున్నారు. ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలిచి ఆసియా కప్ లో తొలి మ్యాచ్ లోనే బోణీ కొట్టాలని టీమిండియా పట్టుదలతో ఉంటుంది.

గత ఏడాది వరల్డ్ కప్ లో పాక్ పై టీమిండియా ఓడిపోయిన స్టేడియంలోనే ఇప్పుడు మ్యాచ్ జరుగుతుంది. దీంతో ఎక్కడైతే పరాజయం పాలయ్యారో.. అక్కడే పాక్ ను చిత్తు చేయాలని టీమిండియా క్రికెటర్లు శ్రమిస్తున్నారు. గత ఏడాది ఈ స్టేడియంలో జరిగిన పాక్ తో మ్యాచ్ తో పాటు.. న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లోనూ భారత్ ఓడింది. దీంతో ఈ స్టేడియంలో టీమిండియాకు చేదు అనుభవాలు ఉన్నాయి రేపు ఆదివారం కూడా దుబాయ్ లో ఇదే స్టేడియంలో మ్యాచ్ జరుగుతుండటం భారత అభిమానులను కలవరపరుస్తుంది. ప్రస్తుతం టీ20లలో పాకిస్తాన్ చాలా బలంగా ఉంది. స్టార్ బ్యాట్స్ మెన్లు ఆ జట్టులో ఉన్నారు. భారత్ కూడా బలంగా ఉండగా.. ఈ స్టేడియంలో టీమిండియాకు మంచి రికార్డులు లేకపోవడం భయపెడుతోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -