Visakha: విశాఖలో దారుణమైన పరిస్థితులు.. ప్రశాంతమైన సిటీ ఇలా మారిందా?

Visakha: ఏపీ రాజధాని నగరం విశాఖ అని వైసీపీ చెబుతోంది. కానీ.. అక్కడ పరిస్థితి చూస్తే.. విశాఖ ఓ నేర నగరంగా మారిపోతుంది. వైజాగ్ అంటే ప్రశాంతకు మారుపేరు. చాలా మంది వారి శేష జీవితాన్ని విశాఖలో గడపాలి అనుకుంటారు. అక్కడి ప్రకృతి అందాలు. ప్రశాంత వాతావరణం. ఇలా చాలా కారణాలతో విశాఖను ఎంచుకుంటారు. కానీ.. గత కొంతకాలంగా చూస్తే.. విశాఖ అంటే హడలిపోయే పరిస్థితి ఏర్పడింది. నగరం నడొబొడ్డున మర్డర్స్, పట్టపగలే భూ కబ్జాలు, బడా నేతలను సైతం కిడ్నాప్ లు. విశాఖ నగరం గురించి చెప్పాలంటే.. ప్రస్తుతం ఈ ఇంట్రడక్షన్ చెప్పాలి.

 

విశాఖలోని కొమ్మాదిలో తహసీల్ధార్ హత్య నగరాన్ని ఉలిక్కిపడేలా చేసింది. జరిగింది ఏ మారుమూల ప్రాంతంలో నిర్మానుష్య ప్రాంతంలోనో కాదు. నేషనల్ హైవేకి ఆనుకొని ఉన్న కొమ్మాదిలో. విద్యాసంస్థలు, చిన్ని చిన్న వ్యాపార స్థావరాలు, పెద్దపెద్ద అపార్ట్‌మెంట్‌లు ఉన్న ప్రాంతంలో ఈ మర్డర్ జరిగింది. అది కూడా తహసీల్దార్ ఇంటికి ధైర్యంగా వెళ్లి ఆయన్ని చంపేసి తిరిగి దర్జాగా హంతకుడు తప్పించుకున్నాడు. ఇది విశాఖ నగరంలోని విషాద ఘటన. ఓ ఎమ్మార్వో అంటే.. మండల మెజిస్ట్రేట్‌కి రక్షణ లేనపుడు సమాన్య ప్రజలకు ఎక్కడ రక్షణ ఉంటుంది? పైగా విశాఖ అంటే ప్రభుత్వ పెద్దలు చెబుతున్న ఎగ్జిక్యూటివ్ కేపిటల్. అక్కడే ఓ అధికారి అతి కిరాతంగా హత్యకు గురైతే.. మారుమూల గ్రామాల్లో ప్రజలకు దిక్కెవరు? ఈ హత్య వెనుక భూదందా వివాదం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే, విశాఖలో భూదందాలపై వస్తున్న ఆరోపణలు కొత్తగా వస్తున్నవి కాదు. గత ఐదేళ్లుగా వస్తున్నాయి. విశాఖను రాజధానికి అభివృద్ధి చేయాలంటే.. ఇలాంటి దందాలు జరిగితే క్యాపిటల్ గా మారుతుందా? దానిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదా? రాష్ట్ర రాజధాని అంటే.. చాలా పెట్టుబడులు రావాలి. విదేశాల నుంచి పారిశ్రామిక వేత్తలు రావాలి. పెట్టుబడులు పెట్టాలి. ఉద్యోగాల సృష్టి జరగాలి. అక్కడ ఉపాధి అవకాశాల కోసం రాష్ట్రంలో నలుమూలల నుంచి యువత రావాలి. అంతేకాదు.. దేశ నలుమూలల నుంచి నైపుణ్యం ఉన్న యువత రావడానికి దైర్యం చేయాలి. అలా చేయాలి అంటే.. రాజధానికి హత్యలు, అత్యాచారాలు, భూదందాలు బెదిరింపులు ఉండకూడదు. కానీ, విశాఖ పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. విశాఖలో ఎన్ని కొత్తకంపెనీలు వచ్చాయి అంటే సమాధానం శూన్యం. కానీ, ఎన్ని దందాలు, ఎంత క్రైమ్ రేటు అంటే మాత్రం చెప్పుకోలేనన్ని సమాధానాలు దొరుకుతాయి.

 

సామాన్యులు, ప్రభుత్వ ఉద్యోగి సంగతి అంటుంచితే.. అధికార పార్టీ ఎంపీ కుటుంబ సభ్యులకే విశాఖలో రక్షణ లేదు. సాక్షాత్తు వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య, కొడుకు ఆరు నెలల క్రితం కిడ్నాప్ అయితే ఆదుకునే నాదుడు లేడు. అయితే.. దుండగులు అంత దర్జాగా ఓ ఎంపీ ఫ్యామిలీని కిడ్నాప్ చేస్తే.. మన పోలీసులు ఏం చేస్తున్నారు? ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది? అసలు ఎంపీ కుటుంబ సభ్యుల కిడ్నాప్ కేసులో కిడ్నాపర్లు ఎవరు? వాళ్లకి పడిన శిక్ష ఏంటీ? ఆ రోజు ఆ కేసులు నిందితులను పట్టుకొని శిక్షిస్తే.. ఈ రోజు తహసీల్దార్ హత్యకు గురి అయ్యే వాడా? ఎందుకు ప్రభుత్వం ఈ అలసత్వం వహిస్తుంది? సీఎం జగన్ ఈ క్రైమ్ రేటును తగ్గించేందుకు చర్యలు ప్రారంభించకపోతే.. ప్రతిపక్షాలు చేస్తున్న భూకబ్జాలు వెనుక జగన్ ఉన్నారని ప్రజలు నమ్మే అవకాశం ఉంటుంది. అంతేకాదు.. రాష్ట్రానికి ఉన్న ఏకైక పెద్ద నగరాన్ని కూడా ఏపీ ప్రజలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. విశాఖ ఏపీకి పెట్టని కోట. దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటే.. విశాఖ కూడా ఏపీని కాపాడుతుంది. మరి ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు తీసుకుంటుందో లేదో చూడాలి

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -